News April 1, 2025

అధికారులకు NTR కలెక్టర్ ఆదేశాలు

image

ఏప్రిల్ 1న ఎన్‌టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల కింద 2,28,813 మందికి రూ. 98.11 కోట్లు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. సోమవారం అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, ఇళ్ల వద్ద పెన్షన్ల పంపిణీ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి పంపిణీ ప్రారంభమవుతుందని, ఎక్కడా ఇబ్బందులు లేకుండా పర్యవేక్షణ జరపాలని సూచించారు.

Similar News

News January 3, 2026

అప్పుడు రూ.1,000.. ఇప్పుడు రూ.22,000

image

AP: 2 నెలల క్రితం టన్ను అరటి ధర రూ.1,000కి పడిపోవడంతో కన్నీరుపెట్టిన రైతన్న ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నాడు. ఉమ్మడి అనంతపురంలో ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం మొదటి కోత టన్ను రూ.22 వేలకు చేరింది. ఎగుమతులు పెరగడం, వాతావరణం అనుకూలించడంతో డిమాండ్ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో సంక్రాంతి వేళ రైతుల మోముల్లో నవ్వులు పూస్తున్నాయి. అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాల్లో అరటి పెద్దసంఖ్యలో సాగైంది.

News January 3, 2026

నిజామాబాద్: నే’తల’కు నొప్పి తప్పదా..?

image

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేయాలనుకుంటున్న వారి సంఖ్య ఈసారి భారీగా పెరగనుంది. అధికార కాంగ్రెస్‌లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. మరో వైపు బీజేపీ, బీఆర్ఎస్‌ల నుంచి కూడా ఒక్కరి కన్నా ఎక్కువ మంది పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ముఖ్య నాయకులకు టికెట్ల కేటాయింపు తలనొప్పి కానుందనే చర్చ జరుగుతోంది.

News January 3, 2026

VZM: కేజీబీవీ నోటిఫికేషన్.. జిల్లాలో ఖాళీల వివరాలు

image

AP KGBV ఔట్‌సోర్సింగ్‌లో 1095 పోస్టులకు <>నోటిఫికేషన్‌<<>> విడుదల చేసింది. ఇందులో విజయనగరం (D)కు టైప్-3లో వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్-10, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్-12, ANM-7, అటెండెర్-3, హెడ్ కుక్-1, ASST కుక్-2, వాచ్ ఉమెన్-1 ఉండగా.. టైప్-4లో వార్డెన్-4, పార్ట్ టైమ్ టీచర్-7, చౌకిదార్-5, హెడ్ కుక్-3 ASST కుక్-8 ఉన్నాయి. 18 ఏళ్లు పైబడిన మహిళలు మాత్రమే అర్హులు. ఈనెల 11లోపు APC ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలి.