News April 1, 2025
నల్గొండ: రాజీవ్ యువ వికాసం గడువు పెంపు

రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తు చేసుకునే తేదీని ఏప్రిల్ 14 వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. రాజీవ్ యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి పొందేందుకు గానూ ఏప్రిల్ 14 వరకు మండల ప్రజాపాలన సేవా కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయంలోని ప్రజాపాలన సేవా కేంద్రాలలో మ్యానువల్‌గా దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
Similar News
News April 6, 2025
మద్యానికి డబ్బు ఇవ్వలేదని కన్నతల్లి హత్య

మద్యానికి డబ్బులివ్వలేదని తల్లిని కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. ఈ దారుణ ఘటన బీబీనగర్ మండలంలో జరిగింది. CI ప్రభాకర్ తెలిపిన వివరాలు.. గుర్రాలదండి కొత్తతండాకు చెందిన మోజి(50) రాములు దంపతుల కుమారుడు శ్రీను. భార్యతో కలిసి చేవెళ్లలో ఉంటున్నాడు. APR 4న భార్యతో గొడవపడి తల్లి దగ్గరకు వచ్చాడు. మద్యానికి తల్లి డబ్బులు ఇవ్వలేదని గొడవ పెట్టుకున్నాడు. కోపంతో మోజి తలపై కర్రతో బలంగా కొట్టి చంపేశాడు.
News April 6, 2025
NLG: రాములోరి కళ్యాణానికి సర్వం సిద్ధం

సీతారాముడి కళ్యాణోత్సవానికి జిల్లా ముస్తాబైంది. జిల్లాలోని అన్ని ఆలయాలల్లో నేడు శ్రీరామనవమి వేడుకలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆలయాలను విద్యుత్ దీపాలు, పూలతో అలంకరించి చలువ పందిళ్లు వేశారు. కళ్యాణ వేడుకల అనంతరం అన్నదానం నిర్వహించనున్నారు. సాయంత్రం కళ్యాణమూర్తులను ఊరేగించనున్నారు. జిల్లా కేంద్రం రామగిరి రామాలయంలో శ్రీరామనవమి వేడుకలకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు.
News April 6, 2025
NLG: 6,497 మందిలో.. 3,033 యువతకు ఉద్యోగాలు

నల్గొండ ఎస్పీ కార్యాలయంలో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన యువ తేజం మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ జాబ్ మేళాకు 6497 మంది పైగా నిరుద్యోగ యువతీ, యువకులు హాజరు కాగా, 3033 మంది ఉద్యోగాలకు ఎంపికకాగా, వారికి ఎస్పీ శరత్ చంద్ర పవార్ నియామక పత్రాలు అందజేశారు. చదువుకున్న యువత చెడు వ్యసనాలకు లోనవకుండా ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఎస్పీ సూచించారు.