News March 26, 2024
ప్రభుత్వ పాఠశాలలకు రూ.91 లక్షలు మంజూరు

నల్గొండ జిల్లాలో 1,483 ప్రభుత్వ పాఠశాలలతో పాటు మోడల్, ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వీటికి ఏటా స్కూల్ మెయిన్టెనెన్స్ కింద (చాక్పీసులు, డస్టర్లు , స్టేషనరీ, ఇతర వస్తువుల కొనుగోలు కోసం) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు మంజూరు చేస్తుంది. రెండేళ్లుగా ప్రభుత్వం జూలై, జనవరి నెలల్లో రెండు విడతల్లో ఈ నిధులు ఇస్తుంది. మూడు రోజుల క్రితం జిల్లాకు రూ.91 లక్షలు మంజూరు చేసింది.
Similar News
News March 20, 2026
నల్గొండ: బడ్జెట్‌లో ‘చేయూత’.. త్వరలో కొత్త పింఛన్లు

రాష్ట్ర బడ్జెట్ (2026-27)లో 2 లక్షల కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలోని 57 ఏళ్లు పైబడిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్న వేలాది మంది అర్హులు ఈ ‘చేయూత’ పింఛన్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
News March 20, 2026
నల్గొండ: కాయ కాచినా.. కష్టం తీరలేదు

వేసవి వచ్చిందంటే బత్తాయి రైతు ఇంట సిరులు కురవాలి. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. ఇటు పక్కనేమో పండుగలు, అటు సరిహద్దుల్లో యుద్ధాలు.. వెరసి బత్తాయి తోటల్లో కోతలు ఆగిపోయి రైతు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సరిహద్దుల్లో యుద్ధం వల్ల జిల్లాలో వేలాది ఎకరాల్లో పండ్ల ఎగుమతి, దిగుమతుల చైన్ పూర్తిగా దెబ్బతిందని రైతులు పేర్కొంటున్నారు. మరోవైపు లారీల కిరాయిలు 10 శాతం మేర పెరిగినట్లు తెలిపారు.
News March 20, 2026
నల్గొండ: 400 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

యాసంగి వరి కోతలు ప్రారంభం కావడంతో జిల్లా యంత్రాంగం ధాన్యం కొనుగోళ్లకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి 14 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేసిన అధికారులు, గతంలో ఉన్న 375 కేంద్రాలను 400కు పెంచాలని నిర్ణయించారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగానే కొనుగోళ్లు ప్రారంభించనున్నారు. అధికారుల కసరత్తుతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.


