News April 1, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News April 11, 2025
కాంగ్రెస్ ఎమ్మెల్యేకు బీజేపీ నగదు బహుమతి

మాజీ రెజ్లర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే వినేశ్ ఫొగట్‌కు హరియాణా BJP ప్రభుత్వం నగదు బహుమతి ప్రకటించింది. బరువు ఎక్కువున్న కారణంతో వినేశ్ ఒలింపిక్స్ ఫైనల్లో డిస్ క్వాలిఫై అవ్వగా ఆమెకు పతక విజేతలకు ఇచ్చే గౌరవాన్నే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఇల్లు/ఉద్యోగం/నగదులో ఏది కావాలో ఎంచుకోవాలని సూచించగా ఆమె నగదుకే మొగ్గు చూపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వినేశ్‌కు రూ.4 కోట్ల నగదు ఇవ్వనుంది.
News April 11, 2025
PHOTO GALLERY: కులవృత్తుల వారికి పనిముట్లు అందించిన సీఎం

AP: ఏలూరు జిల్లా ఆగిరిపల్లి(మ) వడ్లమానులో వివిధ కులవృత్తుల వారితో సీఎం చంద్రబాబు మాట్లాడారు. వారికి పనిముట్లు, ప్రోత్సాహకాలు అందించారు. కాసేపు సెలూన్ షాపులో కూర్చుని ముచ్చటించారు. పశువులకు మేత తినిపించారు. టీడీపీకి మొదటినుంచీ బీసీలే వెన్నెముక అని అన్నారు.
News April 11, 2025
భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

వారాంతంలో స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. టారిఫ్స్‌ను 90 రోజులు నిలిపివేయాలన్న ట్రంప్ నిర్ణయం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాల నేపథ్యంలో సెన్సెక్స్ 1,310 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 429 పాయింట్లు వృద్ధి సాధించింది. టాటా స్టీల్, పవర్ గ్రిడ్, NTPC, M&M, రిలయన్స్, కోటక్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్‌సెర్వ్, భారతీ ఎయిర్‌టెల్, HDFC బ్యాంక్ షేర్లు భారీ లాభాలు సాధించాయి.