News April 1, 2025
నారాయణపేట: భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య

భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని తీలేరు గ్రామంలో చోటుచేసుకుంది. మరికల్ ఎస్ఐ రాము కథనం మేరకు.. తీలేరు గ్రామానికి చెందిన సుభాష్‌కు తన భార్యకు కొన్ని రోజుల క్రితం గొడవలు జరగగా ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. కాపురానికి రమ్మన్నా ఆమె రాకపోవడంతో మనస్తాపం చెందిన సుభాష్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Similar News
News April 3, 2025
సిరిసిల్ల కలెక్టరేట్లో ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

బహుజన ఆత్మగౌరవ ప్రతీక, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, దురాగతలపై తిరగబడిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్యని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా కలెక్టరేట్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్, అధికారులు పాల్గొన్నారు.
News April 3, 2025
₹16,38,071ల విలువైన చెక్కుల పంపిణీ

పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి పంపిణీ చేశారు. ₹16,38,071ల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం సహాయనిధి పేదలకు వరమని తెలిపారు. సీఎం చంద్రబాబు పేదలకు అండగా నిలుస్తున్నారని అన్నారు.
News April 3, 2025
వంశీ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

AP: మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించిన కోర్టు.. విచారణను వారం రోజులు వాయిదా వేసింది. దిగువ కోర్టు బెయిల్ నిరాకరించడంతో హైకోర్టులో వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గన్నవరం TDP ఆఫీసుపై దాడి కేసులో అరెస్టైన వంశీ ప్రస్తుతం విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.