News April 1, 2025
పొందుర్తిలో రైతు ఆత్మహత్య

రాజంపేట మండలం పొందుర్తి గ్రామంలో రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ పుష్పరాజ్ తెలిపారు. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన స్వామి రెండు ఎకరాల్లో పంట సాగు చేసినట్లు చెప్పారు. బోరులో నీటిమట్టం తగ్గిపోవడంతో చేతికొచ్చే పంట ఎండిపోవడాన్ని తట్టుకోలేక తన ఇంటి వద్ద ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు వివరించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
Similar News
News November 5, 2025
వికారాబాద్: అనంతగిరిలో ఘనంగా కార్తీక దీపారాధన

అనంత పద్మనాభ స్వామి కటాక్షంతో సుభిక్షంగా వర్ధిల్లాలని భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని వికారాబాద్ పట్టణానికి సమీపంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి సన్నిధిలో భక్తులు స్వామివారికి పూజలు చేసి, కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీక మాసంలో పూజలు చేస్తే, అన్ని విధాలుగా మంచి జరుగుతుందని భక్తుల అత్యంత భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
News November 5, 2025
జనాభా గణనకు సిద్ధం కావాలి: డైరెక్టర్ జె.నివాస్

భారతదేశ జనాభా గణన – 2027లో నమోదయ్యేందుకు ప్రజలు సిద్ధం కావాలని రాష్ట్ర జన గణన డైరెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. బుధవారం ఆయన భీమిలి మండలం ప్రజా పరిషత్, జీవీఎంసీ జోనల్ కార్యాలయంలోనూ ఇండ్ల గణన పై PRE -TEST (ముందస్తు పరీక్ష) కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర జన గణన డైరెక్టర్ అధ్యక్షతన జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి.రమణమూర్తి ఎన్యూమ్ రేటర్లకు, సూపర్‌వైజర్లకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.
News November 5, 2025
కోటిలింగాలలో గోదావరికి మహా హారతి

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాలలోని ప్రాచీన కోటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం గోదావరి మహా హారతి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గోదావరి తీరం దీపాలతో కళకళలాడగా, అర్చకులు వైదిక మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు చేపట్టారు. స్థానిక భక్తులు, మహిళా సంఘాలు, సేవా సంస్థల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి సంకీర్తనలతో గోదావరికి దీపాలు సమర్పించారు. శివయ్య నామస్మరణలు చేశారు.


