News April 1, 2025

హాజీపూర్: మేకల కాపరి అనుమానాస్పద మృతి

image

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన హాజీపూర్‌లో చోటుచేసుకుంది. SI వినీత వివరాలు.. ర్యాలీ కొలాంగూడకు చెందిన మేకల కాపరి భీము సోమవారం సాయంత్రం ఊరిలోకి వెళ్లి తిరిగిరాలేదు. రోడ్డు పక్కన తలకు బలమైన గాయాలతో కనిపించడంతో కుటుంబీకులు ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడు చిన్ను ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News November 7, 2025

GNT: ఎంపీఈడీ ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ) పరిధిలో జులైలో జరిగిన ఎంపీఈడీ ద్వితీయ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు తెలిపారు. ఫలితాలను వర్సిటీ వెబ్‌సైట్ www.anu.ac.in నుంచి పొందవచ్చని చెప్పారు. రీవాల్యుయేషన్‌కు ప్రతి పేపర్‌కు రూ.1,860 చొప్పున ఈ నెల 17వ తేదీలోగా ఫీజు చెల్లించాలని ఆయన సూచించారు.

News November 7, 2025

పెద్దపల్లి: పాడైన పరికరాల తొలగింపునకు టెండర్ల ఆహ్వానం

image

పెద్దపల్లి జిల్లా విద్యాశాఖ పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న పాడైన కంప్యూటర్లు, మానిటర్లు (405), CPUలు (285), కీబోర్డులు (218), మౌస్‌లు (105), యూపీఎస్‌లు (96), ప్రింటర్లు (6) వంటి E-Waste తొలగింపునకు టెండర్ దరఖాస్తులు ఆహ్వానించారు. ఆసక్తిగల కాంట్రాక్టర్లు తమ యూజ్‌డ్ E-Waste తొలగింపు టెండర్ ఫారమ్‌లు NOV 12వ తేదీలోగా జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి సమర్పించవలసిందిగా అధికారులు తెలిపారు.

News November 7, 2025

పెద్దపల్లి: సూపర్వైజర్లకు స్పష్టమైన దిశానిర్దేశం

image

పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి డా. వాణిశ్రీ అధ్యక్షతన సూపర్వైజర్లతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆరోగ్య కార్యక్రమాల అమలులో సూపర్వైజర్లు కీలకపాత్ర వహించాలని ఆమె సూచించారు. గర్భిణీల ఎర్లీ రిజిస్ట్రేషన్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల ప్రోత్సాహం, మలేరియా-డెంగ్యూ నివారణ, NCD డేటా నమోదు, 100% టీకాల అమలుపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.