News April 1, 2025
నాగర్‌కర్నూల్: ‘అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి’

ఊర్కొండ పేట ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. ఊరుకొండ మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంతో పవిత్రమైన దేవాలయం వద్ద ఇలాంటి చర్యలకు పూనుకోవడం దుర్మార్గమని, అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Similar News
News April 3, 2025
సిరిసిల్ల కలెక్టరేట్లో ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

బహుజన ఆత్మగౌరవ ప్రతీక, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, దురాగతలపై తిరగబడిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్యని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా కలెక్టరేట్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్, అధికారులు పాల్గొన్నారు.
News April 3, 2025
₹16,38,071ల విలువైన చెక్కుల పంపిణీ

పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి పంపిణీ చేశారు. ₹16,38,071ల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం సహాయనిధి పేదలకు వరమని తెలిపారు. సీఎం చంద్రబాబు పేదలకు అండగా నిలుస్తున్నారని అన్నారు.
News April 3, 2025
వంశీ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

AP: మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించిన కోర్టు.. విచారణను వారం రోజులు వాయిదా వేసింది. దిగువ కోర్టు బెయిల్ నిరాకరించడంతో హైకోర్టులో వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గన్నవరం TDP ఆఫీసుపై దాడి కేసులో అరెస్టైన వంశీ ప్రస్తుతం విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.