News April 1, 2025
గద్వాల: అయిజకు రాష్ట్రంలో నాలుగో స్థానం..!

పన్ను వసూళ్లలో అయిజ మున్సిపాలిటీ రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచిందని కమిషనర్ సైదులు సోమవారం తెలిపారు. దీంతో అయిజ మున్సిపాలిటీ 15వ ఆర్థిక సంఘం నిధులు పొందేందుకు అర్హత సాధించిందని చెప్పారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.1.82 కోట్లు లక్ష్యం నిర్దేశించుకుని, నేటికి రూ.1.62 కోట్లు వసూలు చేశామని తెలిపారు. ఇందుకు తమ కార్యాలయ సిబ్బంది విశేషంగా కృషి చేశారని ప్రశంసించారు.
Similar News
News January 9, 2026
వికారాబాద్: టెట్ పరీక్షకు తండ్రి-కొడుకులు

ఉపాధ్యాయులకు టెట్ సంకటంగా మారింది. 2010 కంటే ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం నిర్వహించిన టెట్ పరీక్షకు పెద్దేముల్ మండలంలోని ఎర్రగడ్డ తండాకు చెందిన గోబ్ర్యా నాయక్ కొండాపూర్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్నాడు. తన కొడుకు దినేశ్ గతంలో డీఎస్సీ రాశారు. తాజాగా తండ్రి కొడుకులు పరీక్షకు హాజరవ్వడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
News January 9, 2026
బొగ్గు స్కాంలో అమిత్ షా.. నా దగ్గర పెన్ డ్రైవ్‌లు ఉన్నాయి: మమత

బొగ్గు కుంభకోణం ద్వారా వచ్చే ఆదాయం మొత్తం కేంద్ర మంత్రి అమిత్ షాకే వెళ్తుందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. తన ప్రభుత్వంపై స్థాయికి మించి ఒత్తిడి చేస్తే అన్నింటినీ బయటపెడతానని హెచ్చరించారు. ‘కోల్ స్కాంలో షా ప్రమేయం ఉంది. నా దగ్గర పెన్ డ్రైవ్‌లు ఉన్నాయి. సీఎం కుర్చీపై ఉన్న గౌరవంతో మౌనంగా ఉన్నా. నేను వివరాలు బయటపెడితే దేశం షేక్ అవుతుంది. ఒక పాయింట్ వరకే దేన్నైనా సహిస్తా’ అని హెచ్చరించారు.
News January 9, 2026
అన్నమయ్య జిల్లా ఫైర్ ఆఫీసర్‌గా ఆదినారాయణ రెడ్డి

అన్నమయ్య జిల్లా ఫైర్ ఆఫీసర్‌గా ఆదినారాయణ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. తిరుమల నుంచి బదిలీపై ఆయన వచ్చారు. జిల్లా పరిధిలోని స్టేషన్ ఫైర్ ఆఫీసర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. అగ్నిమాపక శాఖ పనితీరు, అత్యవసర సేవలు, భద్రత చర్యలపై చర్చించారు. ఇంతకుముందు అన్నమయ్య జిల్లా డిస్టిక్ ఫైర్ ఆఫీసర్‌గా పనిచేసిన అనిల్ కుమార్ గుంటూరు జిల్లాకు బదిలీ అయ్యారు.


