News April 1, 2025

MHBD: ఘిబ్లీ ట్రెండ్.. వైరల్ అవుతున్న అనంతాద్రి దేవాలయం

image

మహబూబాబాద్ జిల్లాలో నెట్టింట వైరల్ అవుతున్న ఘిబ్లీ ఆర్ట్‌ను అతి తక్కువ సమయంలో ఎక్కువ మంది ప్రజలు ఆదరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన అనంతాద్రి ఆలయ చిత్రం ఇప్పుడు ఘిబ్లీ ఆర్ట్‌తో మహబూబాబాద్‌లో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో ప్రజలకు చూపించేందుకు Way2News ప్రత్యేక చిత్రాన్ని తీసుకువచ్చింది. ఫొటో ఎలా ఉందో కామెంట్ చేయండి.

Similar News

News November 10, 2025

ఏలూరు: ధాన్యం సేకరణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

ఏలూరు జిల్లాలో ఖరీఫ్ పంట ధాన్యం కనీస మద్దతు ధర ‘గ్రేడ్-ఎ’ రకం క్వింటాల్‌కు రూ.2,389, కామన్ రకం రూ.2,369 చొప్పున నిర్ణయించినట్లు సివిల్ సప్లై మేనేజర్ శివరామమూర్తి సోమవారం తెలిపారు. జిల్లాలో 234 రైతు సేవా కేంద్రాలు, 102 ఏజెన్సీల ద్వారా దాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. రైతులకు 24 గంటలు అందుబాటులో ఉండేలా 18004256453, 7702003584 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

News November 10, 2025

సురక్షిత ప్రసవమే లక్ష్యం : డిఎంహెచ్ఓ

image

సురక్షిత ప్రసవమే లక్ష్యంగా గర్భిణీలకు వైద్య సేవలందించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.భాస్కరరావు స్పష్టం చేశారు. ఈ మేరకు మాతా, శిశు ఆరోగ్యంపై సమీక్షా సమావేశాన్ని పార్వతీపురం ఆరోగ్య కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. గర్భిణీలకు నిర్దేశించిన ప్రతీ ఆరోగ్య కార్యక్రమాన్ని పక్కగా అమలు జరిపి మెరుగైన వైద్య సేవలు అందేలా క్షేత్ర స్థాయిలో వైద్య అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు.

News November 10, 2025

నల్గొండ: ధాన్యం కొనుగోలుపై మంత్రుల సమీక్ష

image

ఖరీఫ్ ధాన్యం సేకరణ పురోగతిపై రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. నల్గొండ జిల్లాలో రైతులకు ఇప్పటివరకు రూ.160 కోట్లు చెల్లించినట్లు కలెక్టర్ తెలిపారు. తడిసిన 4,600 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లర్లు కొన్నారని వివరించారు. పత్తి కొనుగోళ్ల కోసం అదనంగా తేమ కొలిచే యంత్రాల కొనుగోలుకు మంత్రి తుమ్మల ఆదేశించారు.