News March 26, 2024
నేటి నుంచి నావికా దళ విన్యాసాలు

నేటి నుంచి కాకినాడ సాగరతీరంలో భారత్- అమెరికా దేశాల సంయుక్త నావికా దళ విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఎస్.సతీష్‌కుమార్ తెలిపారు. స్థానిక సూర్యారావుపేట నేవెల్ ఎన్‌క్లేవ్ ప్రాంతంలో నిర్వహించనున్న టైగర్ ట్రంప్ విన్యాసాల ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. నేవెల్ ఎన్‌క్లేవ్ పరిధిలో ఆరు రోజుల పాటు నేవీ, ఆర్మీ అధికారులు సంయుక్తంగా విన్యాసాలు నిర్వహిస్తాయన్నారు.
Similar News
News September 28, 2025
గోపాలపురంలో రాబరీ గ్యాంగ్.. జాగ్రత్త

మధ్యప్రదేశ్, రాజస్థాన్‌కు చెందిన ఆరుగురు సభ్యుల రాబరీ గ్యాంగ్ సంచరిస్తున్నట్లు సమాచారం ఉందని గోపాలపురం ఎస్.ఐ. మనోహర్ తెలిపారు. ఈ గ్యాంగ్ పత్తిపాడు, నల్లజర్లలో బంగారం దొంగతనాలతో పాటు అనేక పెద్ద దొంగతనాలకు పాల్పడిందని చెప్పారు. వారు లాడ్జ్‌లు, ధాబాలలో తలదాచుకుంటూ, మరెక్కడైనా నేరానికి పాల్పడే అవకాశం ఉందని ఎస్.ఐ. హెచ్చరించారు. ఆ గ్యాంగ్ సభ్యులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
News September 28, 2025
5 రోజులు భారీ వర్షాలు: కలెక్టర్ కీర్తి చేకూరి

గోదావరి వరదల కారణంగా తూ.గో జిల్లాలో రానున్న 5 రోజులు అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఆదివారం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి శాఖ సమన్వయంతో, వేగంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. బాధితులను సురక్షిత ప్రదేశాలకు తరలించి, అవసరమైన చోట సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
News September 28, 2025
గోకవరంలో స్వల్పంగా తగ్గిన చికెన్ ధరలు

గోకవరంలో ఆదివారం చికెన్ దుకాణాలు కొనుగోలుదారులతో రద్దీగా కనిపించాయి. మాంసం, చేపలు, రొయ్యలు, పీతల ధరలు స్వల్పంగా పెరిగాయి. బ్రాయిలర్ చికెన్ కిలో రూ.210-230, నాటుకోడి మాంసం రూ.700, మేక మాంసం రూ.800, వరకు ధరలు పలికాయి. దసరా ఉత్సవాలు జరుగుతున్నందున చాలా మంది భవాని మాలలు వేయడంతో చికెన్ ధరలు స్వల్పంగా తగ్గాయని వ్యాపారస్తులు అంటున్నారు. మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.