News March 26, 2024

MBNR: తల్లి మరణాన్ని తట్టుకోలేక కుమారుడు మృతి!

image

తల్లి మరణాన్ని తట్టుకోలేక కుమారుడు మృతిచెందిన ఘటన గట్టులో సోమవారం చోటుచేసుకుంది. గట్టుకు చెందిన మఠం ఆదెమ్మ(85) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందింది. ఆదెమ్మ కుమారుడు మఠం బూదెప్ప (67) తల్లి మృతితో ఆందోళన చెంది అస్వస్థతకు గురయ్యాడు. రాయిచూర్ అస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 24 గంటలైనా తీరకముందే ఇంట్లో ఇరువురు మృత్యువాత పడడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగింది.

Similar News

News July 11, 2025

MBNR: పి.వి.రమణ పురస్కారానికి దరఖాస్తుల ఆహ్వానం

image

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో రంగస్థల కళలశాఖ ప్రతి సంవత్సరం ‘పి.వి.రమణ రంగస్థల స్మారక పురస్కారం’ ప్రదానం చేయనున్నారు. 2024-25 సంవత్సరానికి గాను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు యూనివర్సిటీ ఓ సర్కులర్ విడుదల చేసింది. ఆగస్టు 1లోగా రంగస్థలంలో కృషి చేసిన నటులు, సాంకేతిక నిపుణులు అర్హులైన వారు తెలుగు విశ్వవిద్యాలయం బాచుపల్లి ప్రాంగణంలో తమ బయోడేటాతో దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు.

News July 11, 2025

పాలమూరు: PM KISAN… జాగ్రత్త సుమా!

image

రైతులకు కేంద్రం అందిస్తున్న రూ.6వేలు ‘PM-KISAAN’ పథకాన్ని అడ్డుపెట్టుకొని సైబర్ కేటుగాళ్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. వాటిపై క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. నకిలీ యాప్లపై క్లిక్ చేయవద్దని, OTPలు ఎవరికి చెప్పవద్దని ఆయా జిల్లాల ఎస్పీలు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరగాళ్లపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జానకి సూచించారు. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే 1930కు ఫోన్ చేయాలన్నారు. SHARE IT

News July 10, 2025

MBNR: కల్లు డిపోల లైసెన్స్ రద్దు చేస్తాం: మంత్రి

image

HYDలో కల్తీ కల్లు ఘటనపై మంత్రి జూపల్లి కృష్ణారావు Xలో ట్వీట్ చేశారు. ‘ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే ఎంతటి వారినైనా వదలం. కల్లు శాంపిల్ టెస్టింగ్ కోసం ఫోరెన్సిక్ పంపాం. నివేదిక ఆధారంగా బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు, కల్లు డిపోల లైసెన్స్ రద్దు చేస్తాం. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం’ అని రాసుకొచ్చారు.