News April 1, 2025
పన్నుల ద్వారా ఇప్పటివరకు రూ.80 కోట్లకు పైగా ఆదాయం: కమిషనర్

పన్ను ద్వారా బల్దియాకు సుమారు రూ.80 కోట్లకు పైగా ఆదాయం వసూలు చేసినట్లు బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తెలిపారు. హన్మకొండ అశోక టాకీస్ వద్ద గల ఈ సేవా కేంద్రాన్ని కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేసి పన్ను వసూళ్ల తీరును పరిశీలించారు. రెగ్యులర్ పన్ను వసూళ్లతో పాటు ఆస్తి పన్నుపై 90% వడ్డీ మాఫీ పథకంను సద్వినియోగం చేసుకోవడం ద్వారా సుమారు రూ.80 కోట్లకు పైగా వసూళ్లు జరిపామని అన్నారు.
Similar News
News April 3, 2025
ఏటూరునాగారం: భార్య చేతిలో భర్త హతం!

భార్య చేతిలో భర్త హతమైన ఘటన ఏటూరునాగారం మండలం రోహీరులో జరిగింది. స్థానికుల వివరాలు.. భర్త మండప సమ్మయ్య తరచూ మద్యం తాగి గొడవ పెడుతున్నాడు. విసుగు చెందిన భార్య నేడు తీవ్రంగా కొట్టడంతో సమ్మయ్య మృతి చెందాడన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పంచనామ నిర్వహించి కేసు నమోదు చేసి ధర్యాప్తు చేపట్టారు.
News April 3, 2025
BREAKING: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

జడ్జిల ఆస్తుల వివరాలు ప్రజలకు తెలిసేలా కోర్టు వెబ్‌సైట్‌లో పబ్లిష్ చేయనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఏప్రిల్ 1న జరిగిన ఫుల్ కోర్టు మీటింగ్‌లో మొత్తం 33 మంది జడ్జిల అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సంస్కరణ సుప్రీంకోర్టుకు భవిష్యత్‌లో వచ్చే జడ్జిలకూ వర్తిస్తుందని తెలిపింది. ఇటీవల జడ్జి యశ్వంత్ వర్మ(ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి) ఇంట్లో భారీగా నోట్లకట్టలు లభ్యమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
News April 3, 2025
ఆ నోళ్లను 10 నెలల్లోనే మూయించాం: లోకేశ్

AP: రాష్ట్రంలో JCB పాలన పోయి, పేదలకు పట్టాలిచ్చే ప్రభుత్వం వచ్చిందని మంత్రి లోకేశ్ అన్నారు. తాను గెలిస్తే మంగళగిరిలోని ఇళ్లు పీకేస్తారంటూ ప్రచారం చేసిన నోళ్లను 10నెలల్లోనే మూయించామని తెలిపారు. ప్రభుత్వ భూముల్లో నివసించే వారికి పట్టాలిచ్చే హామీని తన నియోజకవర్గం నుంచే నెరవేరుస్తున్నట్లు చెప్పారు. తొలి విడత 3వేల ఇళ్ల పట్టాలు అందిస్తామన్నారు. స్వచ్ఛతలో మంగళగిరిని దేశంలోనే నంబర్-1 చేస్తామని చెప్పారు.