News April 1, 2025

సిరిసిల్ల: యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

image

రాజీవ్ యువ వికాసం పథకానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు దరఖాస్తు చేసుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో సోమవారం ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 14వ తేదీలోగా https://tgobmmsnew.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం దరఖాస్తు ఫారాన్ని ఎంపీడీవో కార్యాలయం, పట్టణంలో మునిసిపల్ లో సమర్పించాలని స్పష్టం చేశారు.

Similar News

News November 10, 2025

వేములవాడ: ప్రధాన ద్వారం మళ్లీ మూసేశారు..! అధికారుల తీరుపై విమర్శలు

image

వేములవాడ రాజన్న ఆలయం ప్రధాన ద్వారాన్ని మళ్ళీ మూసివేశారు. కొద్ది రోజులుగా రాజగోపురం ద్వారా ఒకే మార్గం నుంచి భక్తులను అనుమతించడం వల్ల ప్రధాన ద్వారం వద్ద భక్తుల రద్దీ పెరిగింది. రద్దీని తట్టుకోవడానికి బారికేడ్లు పెట్టి అదనపు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఏకంగా ప్రధాన ద్వారాన్ని మూసివేశారు. మహాశివరాత్రి సందర్భంగా ఇదే విధంగా గేటు మూయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.

News November 10, 2025

MBNR: నీటి వనరుల గణనపై జిల్లా స్టీరింగ్ కమిటీ ఏర్పాటు

image

రాష్ట్ర ఆర్థిక శాఖ ఆదేశాల మేరకు, 7వ చిన్న నీటి పారుదల గణన, రెండో నీటి వనరుల గణన 2023-24 కోసం జిల్లా స్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి అనంతరం కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పాల్గొన్నారు.

News November 10, 2025

తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర కార్యదర్శిగా ఆదిలాబాద్ వాసికి చోటు

image

తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర కార్యదర్శిగా ఆదిలాబాద్ మాజీ కౌన్సిలర్, బీజేపీ ఫ్లోర్ లిడర్ బండారి సతీష్‌కు చోటు లభించింది. రాష్ట్ర కార్యవర్గం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ గౌరవం, సంక్షేమం కోసం కృషి చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు డా.చీమ శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాకాల రామచందర్ బండారి సతీష్‌ను ఆదేశించారు.