News April 1, 2025
నేటి నుంచి ఇంటర్ కాలేజీలు ప్రారంభం

AP: రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కళాశాలలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 23 వరకు క్లాసులు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. ఈ నెల 24 నుంచి జూన్ 1 వరకు వేసవి సెలవులు ఉంటాయి. సెకండియర్ విద్యార్థులకు నేటి నుంచే క్లాసులు జరగనుండగా ఈనెల 7 నుంచి ఫస్టియర్ అడ్మిషన్లు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఎంబైపీసీ అనే కొత్త కోర్సును కూడా ప్రవేశపెడుతున్నారు.
Similar News
News April 3, 2025
మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నా: మల్‌రెడ్డి

TG: క్యాబినెట్ విస్తరణలో తనకు అవకాశం దక్కుతుందని ఇబ్రహీంపట్నం MLA మల్‌రెడ్డి రంగారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో AICC అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీని కలిసి అవకాశం ఇవ్వాలని కోరారు. గతంలో HYD-రంగారెడ్డి జిల్లాల నుంచి చాలామంది మంత్రులు ఉండేవారని, తనకు పదవి ఇవ్వడం ద్వారా RR జిల్లాకు పదవి దక్కినట్లు అవుతుందన్నారు. తనకు ఇవ్వకపోయినా జిల్లాలో ఏదో ఒక సామాజికవర్గానికి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
News April 3, 2025
ఆ ఫొటోగ్రాఫర్‌ను పట్టిస్తే రూ.10 లక్షలిస్తాం: కాంగ్రెస్ నేత

HCU భూములను జేసీబీలు చదును చేస్తుంటే అక్కడే ఉన్న జింకలు, నెమళ్లు పరుగులు తీసిన ఫొటోను సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. అయితే, ఇది ఏఐ ఎడిటెడ్ ఫొటో అని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి ఇంత గొప్ప ఫొటోను తీసిన వ్యక్తిని గుర్తించి తమకు పట్టిస్తే రూ.10 లక్షలు రివార్డ్ ఇస్తామని సెటైరికల్ ట్వీట్ చేశారు.
News April 3, 2025
3వేలు దాటిన భూకంప మృతుల సంఖ్య

భారీ భూకంపం ధాటికి మయన్మార్‌లో మృతుల సంఖ్య 3,085కు చేరినట్లు సైనిక ప్రభుత్వం వెల్లడించింది. 4,715 మంది గాయపడ్డారని, 341 మంది గల్లంతయ్యారని తెలిపింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం మృతుల సంఖ్య ప్రభుత్వం చెప్పినదానికంటే చాలా అధికంగా ఉంటుందని సమాచారం. భూకంప విధ్వంసం కారణంగా 30 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఐరాస నివేదిక పేర్కొంది.