News March 26, 2024
చంద్రగిరి: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి
మృతి చెందిన ఘటన తొండవాడ సమీపంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ఝార్ఖండ్ కు చెందిన రహదేవ్ సింగ్(26) చంద్రగిరిలో కూలీగా పనిచేస్తున్నాడు. ద్విచక్ర వాహనంలో వస్తుండగా పెట్రోల్ లేకపోవడంతో ఆగిపోయింది. దీంతో రహదేవ్ సింగ్ పెట్రోల్ పట్టించుకునేందుకు రోడ్డు దాటే క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.
Similar News
News March 18, 2026
కేంద్ర మంత్రిని కలిసిన రోజా

నగరి నియోజకవర్గ సమస్యలను కేంద్రమంత్రి గడ్కరీ దృష్టికి తీసుకెళ్లినట్లు మాజీ మంత్రి రోజా తెలిపారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయాన్ని తొలగించేలా చేస్తున్నారని ఆయన దృష్టికి తీసుకుపోయారు. కొండచుట్టూ మండప ప్రాధాన్యాన్ని తెలియజేసి, వాటిని కాపాడేలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని విన్నవించినట్లు పేర్కొన్నారు.
News March 18, 2026
చిత్తూరు ZP విభజనకు కసరత్తు.!

ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని జిల్లా పరిషత్‌ను ఎన్నికల నాటికి మూడు జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసేలా రాష్ట్రస్థాయిలో కసరత్తు నిర్వహిస్తున్నారు. సెప్టెంబరులో జడ్పీ పదవీకాలం ముగియనుండటంతో, ఆలోపు విభజించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు కొత్తగా జిల్లా పరిషత్తులు ఏర్పడనున్నాయి. దీంతో పరిపాలనా సౌలభ్యం మెరుగు పడనుంది.
News March 18, 2026
లక్ష్యం రూ.56 కోట్లు.. ఇంకా రూ.26 కోట్ల బకాయిలు

పట్టణాల్లో ఆస్తి, నీటి పన్ను లక్ష్యాలను చేరుకునేందుకు కేవలం 14 రోజులు మాత్రమే గడువు ఉంది. చిత్తూరు, పుంగనూరు, పలమనేరు, నగరి, కుప్పం మున్సిపాలిటీల పరిధిలో సుమారు రూ.56 కోట్ల ఆస్తి పన్ను వసూలు కావాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ. 30 కోట్లు మాత్రమే వసూలు అయినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం బకాయిలపై 50% వడ్డీ రాయితీ ప్రకటించిన నేపథ్యంలో 100% లక్ష్యాలు చేరుకుంటారేమో చూడాల్సి ఉంది.


