News April 1, 2025
నేటి నుంచి నెలపాటు APRIL పూల్..

ఏప్రిల్ 1 వచ్చిందంటే ఒకరిని ఒకరు పూల్స్ చేసుకుని సరదా పడుతూ ఉంటారు. లేనిది ఉన్నట్టు చెప్పి ఉన్నది లేనట్లు చెప్పి, యథాలాపంగా ఉన్నవారు అవాక్కయ్యే తరుణంలో ఏప్రిల్ ఫూల్ అని ఆట పట్టించేవారు. 2000 సంవత్సరం జనరేషన్ వరకు ఈ ఏప్రిల్ ఫూల్ బాగా ప్రాచుర్యంలో ఉండేది. ప్రస్తుతం మారిన కాలంతో పాటు చిన్న, పెద్దల్లో కూడా ఆటలు, ముచ్చట్లు లేవనే చెప్పుకోవాలి. మీకూ ఇటువంటి సన్నివేశం ఎప్పుడైనా ఎదురైందా.. కామెంట్ చేయండి
Similar News
News September 16, 2025
అది శనీశ్వరుడి విగ్రహం: భానుప్రకాశ్ రెడ్డి

అలిపిరిలో అపచారమని భూమన చేసిన <<17725838>>ఆరోపణలపై <<>>TTD బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి స్పందించారు. ‘అలిపిరి వద్ద గతంలో కన్నయ్య అనే వ్యక్తి ఓ ప్రైవేట్ శిల్పశాల నిర్వహించాడు. ఓ భక్తుడు శనీశ్వరుడి విగ్రహం ఆర్డర్ ఇవ్వగా.. తయారీలో లోపంతో 10 ఏళ్ల నుంచి అక్కడ ఉంచారు. ప్రక్కా ప్లాన్‌తో ఆ విగ్రహం చుట్టూ నిన్న రాత్రి మద్యం సీసాలు పడేశారు. అది మహావిష్ణువు విగ్రహమని భూమన దుష్ప్రచారం చేస్తున్నారని’ అని ఆయన చెప్పారు.
News September 16, 2025
రేపు తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ బుధవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్య ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుండగా, 10.05 గంటలకు గౌరవ వందనం ఉంటుందన్నారు. అనంతరం ప్రసంగం చేస్తారని చెప్పారు.
News September 16, 2025
మంచిర్యాలలో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు

మంచిర్యాలలో గోదావరి పుష్కరాల కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఆర్డీఓ శ్రీనివాసరావు, ఎమ్మార్వో రపతుల్లా హుస్సేన్, ఏసీపీ ప్రకాశ్, సీఐ ప్రమోద్ రావు మంగళవారం పర్యటించారు. బస్టాండ్, రైల్వే స్టేషన్ నుంచి గోదావరి నది తీరం వరకు రూట్ మ్యాప్‌ను పరిశీలించారు. అనంతరం పుష్కర ఘాట్‌లను సందర్శించి ఏర్పాట్లపై సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.