News April 1, 2025
ఆర్అండ్‌బీ కార్యాలయం బోర్డులో అంబేడ్కర్ పేరు ఎక్కడ?

కోనసీమ జిల్లాను అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చి చాలా రోజులు గడుస్తోంది. కానీ కొత్తపేట మండల రోడ్లు భవనాల శాఖ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన బోర్డులో కోనసీమ జిల్లా అని మాత్రమే ఉంది. కోనసీమ జిల్లాకు ముందు అంబేడ్కర్ పేరు లేకపోవడంతో స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పేరు మార్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News July 5, 2025
‘విశాఖలో టూరిజం యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం’

విశాఖను అంతర్జాతీయ స్థాయిలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కందుల దుర్గేశ్ స్పష్టం చేశారు. సన్ క్యాంపస్‌లోని విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. త్వరలోనే టూరిజం యూనివర్సిటీని విశాఖలో నెలకొల్పేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలియజేశారు. పర్యాటక రంగంలో అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, సన్ CMD శ్రీకాంత్ జాస్తి పాల్గొన్నారు.
News July 5, 2025
కోరుట్ల: కత్తిపోట్ల ఘటన.. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

జగిత్యాల జిల్లా కోరుట్ల రవీంద్రరోడ్‌కు చెందిన ఇర్యాల సత్యనారాయణ(49)పై ఇటీవల అదే కాలనీకి చెందిన గంగనర్సయ్య పాత కక్షల కారణంగా <<16876293>>కత్తితో దాడి<<>> చేశాడు. ఆ దాడిలో గాయపడిన సత్యనారాయణను కరీంనగర్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఈ క్రమంలోనే ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మరణించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News July 5, 2025
సాగర్ నుంచి పాలేరుకు నీటి విడుదల

పాలేరు రిజర్వాయర్‌లో నీటి నిల్వ తగ్గినందున తాగునీటికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. ప్రాజెక్టు ఏఈ కృష్ణయ్య ఎడమ కాల్వ ద్వారా పాలేరుకు నీటిని విడుదల చేశారు. రోజుకు మూడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు.