News April 1, 2025
సత్యసాయి జిల్లాలో ఆరుగురిపై పోక్సో కేసు

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం రెడ్డిపల్లిలో ఓ బాలికను ప్రేమ పేరుతో వేధించిన ఆరుగురిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ నరేంద్రరెడ్డి తెలిపారు. సోమవారం నల్లమాడ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధిత బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుల మీద కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామల్లో బాలికలు, వారి కుటుంబ సభ్యులను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
Similar News
News September 13, 2025
HYD: స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులు

మాసబ్‌ట్యాంక్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డీ-ఫార్మసీ కోర్సులో స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ చంద్రశేఖర్ తెలిపారు. దోస్త్ ప్రక్రియ ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈ నెల 16న ఉదయం 10 గంటలకు జరిగే అడ్మిషన్ ప్రక్రియకు హాజరుకావాలని పేర్కొన్నారు.
News September 13, 2025
HYD: జీహెచ్ఎంసీలో 97మందికి పదోన్నతులు

జీహెచ్ఎంసీలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్లు, వారితో సమాన స్థాయి హోదా ఉన్న 97 మందికి సూపరింటెండెంట్లుగా పదోన్నతులు కల్పిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం మేరకు తాత్కాలిక పదోన్నతి కల్పించినట్లు పేర్కొన్నారు.
News September 13, 2025
పటాన్చెరు: దేవుడు స్థలాన్ని చూపించాడని మిస్సింగ్

యువకుడు అదృశ్యమైన ఘటన పటాన్చెరులో చోటు చేసుకుంది. ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఇందిరమ్మ కాలనీకి చెందిన వీరేశ్ (22) గురువారం డ్యూటీకి వెళ్తున్నానని వెళ్లి తిరిగి రాలేదు. ‘నాకు కలలో దేవుడు ఒక స్థలాన్ని చూపించాడు అక్కడికి వెళ్తున్నాను’ అని అన్నకు మెసేజ్ పెట్టాడు. వెంటనే ఫోన్ చేయగా స్విచ్ఆఫ్ వచ్చింది. తమ్ముడి మిస్సింగ్ పై అన్న పటాన్చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.