News April 1, 2025
నేటి నుంచి విజయ, సంగం పాల ధరల పెంపు

AP: నేటి నుంచి విజయ, సంగం పాల ధరలను లీటరుకు రూ.2 పెంచుతున్నట్లు ఆయా డెయిరీలు తెలిపాయి. పాల ఉత్పత్తి తగ్గడం, ప్యాకింగ్, ఇతర ఖర్చులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. విజయ గోల్డ్ పాల ధర ప్రస్తుతం లీటర్ రూ.74 ఉండగా రూ.76 కానుంది. అలాగే టోన్డ్ మిల్క్ పెరుగు ప్యాకెట్ (900 గ్రాములు) రూ.62 నుంచి రూ.64కు పెరగనుంది. నెలవారీ పాలకార్డు ఉన్న వారికి ఈ నెల 8 వరకు పాత ధరలే వర్తిస్తాయని తెలిపింది.
Similar News
News November 7, 2025
SBI అరుదైన ఘనత

మార్కెట్ విలువలో 100 బిలియన్ డాలర్ల(రూ.8.8 లక్షల కోట్లు) కంపెనీగా SBI నిలిచింది. ఈ ఘనత సాధించిన ఆరో భారత కంపెనీగా, తొలి ప్రభుత్వ రంగ సంస్థగా రికార్డు సృష్టించింది. నిన్న SBI షేరు జీవితకాల గరిష్ఠం రూ.971.15కు చేరడంతో ఈ ఘనత సాధ్యమైంది. ఈ జాబితాలో ఇప్పటి వరకు రిలయన్స్, HDFC బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, టీసీఎస్, ICICI బ్యాంక్ ఉన్నాయి.
News November 7, 2025
చీమలంటే భయం.. అసలేంటీ మైర్మెకోఫోబియా?

మైర్మెకోఫోబియా గ్రీకు పదాలు మైర్మెక్స్(చీమ)+ ఫోబోస్(భయం) నుంచి వచ్చింది. ఈ ఫోబియా గలవారు చీమలతో ప్రమాదం, నష్టమని ఆందోళన చెందుతారు. వారికి చీమలంటే అసహ్యం, భయం. ఈ భయం పెరిగితే చీమలను చూస్తే పానిక్ అటాక్ రావొచ్చు. దీనికి కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ, హిప్నోథెరపీ, ఎక్స్‌పోజర్ థెరపీల చికిత్సతో తగ్గించవచ్చు. ఈ భయంతో సంగారెడ్డి (TG) జిల్లా అమీన్‌పూర్‌లో మనీషా నిన్న ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే.
News November 7, 2025
నరసాపురం వరకు వందేభారత్ రైలు

AP: చెన్నై సెంట్రల్- విజయవాడ మధ్య నడుస్తున్న వందేభారత్ రైలు(20677/20678)ను నరసాపురం వరకు పొడిగిస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం ఈ రైలు 5.30AMకు చెన్నైలో బయలుదేరి రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి మీదుగా విజయవాడకు చేరుతోంది. ఇకపై అక్కడి నుంచి గుడివాడ, భీమవరం మీదుగా నరసాపురానికి 2.10PMకు చేరుకుంటుంది. తిరిగి అక్కడ 3.20PMకు బయలుదేరి 11.45PMకు చెన్నైకి వెళ్తుంది.


