News April 1, 2025
ఏప్రిల్ 1ని ‘ఫూల్స్ డే’ అని ఎందుకంటారంటే?

ఏటా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 1న ‘ఫూల్స్ డే’ నిర్వహిస్తారు. 16వ శతాబ్దం వరకు జూలియస్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 1ని న్యూఇయర్‌గా జరుపుకునేవారు. ఆ తర్వాత పోప్ గ్రెగోరీ VIII నూతన సంవత్సర వేడుకలను జనవరి 1కి మార్చారు. ఈ విషయం తెలియని ఫ్రాన్స్ ప్రజలు ఏప్రిల్ 1నే వేడుకలు జరుపుకున్నారు. దీంతో ఇతర ప్రాంతాలవారు వారిని ఫూల్స్‌గా ఆటపట్టించారు. అప్పటి నుంచి ఏప్రిల్ 1నాడే ‘ఫూల్స్ డే’ జరుపుకుంటున్నారు.
Similar News
News April 3, 2025
YCP ఎంపీ మిథున్ రెడ్డికి షాక్

AP: మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. రాష్ట్రంలో మద్యం విక్రయాలు, తయారీలో అవకతవకలు జరిగాయని, అందులో మిథున్ పాత్ర ఉందంటూ ఆయనపై కేసు నమోదైంది. దీంతో మిథున్ ముందస్తు బెయిల్ కోసం అప్లై చేశారు. దానిపై ఇవాళ విచారణ చేపట్టిన న్యాయస్థానం బెయిల్ ఇవ్వడం కుదరదంటూ పిటిషన్‌ను తోసిపుచ్చింది.
News April 3, 2025
రూ.కోటి విరాళం ఇచ్చే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు: TTD

AP: తిరుమల శ్రీవారికి రూ. కోటి విరాళం ఇచ్చే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించనున్నట్లు TTD వెల్లడించింది. ఏడాదిలో 3రోజులు సుప్రభాత సేవ, 3 సార్లు బ్రేక్ , 4రోజులు సుపథం ప్రవేశ దర్శనాలు కల్పిస్తామంది. రూ.3వేల వసతి గృహంలో 3రోజుల పాటు ఉండొచ్చని చెప్పింది. స్వామివారి లడ్డూలు, వేద ఆశీర్వచనం వంటి సౌకర్యాలను పొందొచ్చని తెలిపింది. అలాగే 5గ్రా. శ్రీవారి బంగారం, 50గ్రా. సిల్వర్ డాలర్ అందజేస్తామంది.
News April 3, 2025
HCU విద్యార్థులపై కేసులను ఎత్తివేస్తాం: భట్టి

TG: HCUకు సంబంధించిన భూమిని ఇంచుకూడా ప్రభుత్వం తీసుకోదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని ఢిల్లీలో తెలిపారు. వారిపై దుందుడుకుగా వ్యవహరించవద్దని పోలీసులను ఆదేశించారు. గతంలో బిల్లీరావుకు చంద్రబాబు అప్పనంగా 400 ఎకరాలు కట్టబెడితే నాటి సీఎం వైఎస్సార్ ఆ భూములను కాపాడారని చెప్పారు.