News April 1, 2025
భూపాలపల్లి : నిరుద్యోగ యువత ఆందోళన.. !

భూపాలపల్లి జిల్లాలో రాజీవ్ యువ వికాస్ పథకం కోసం దరఖాస్తు చేసిన నిరుద్యోగ యువత ఆందోళనలో ఉన్నారు. ఈ పథకం ప్రయోజనాలు గ్రామీణ కార్యకర్తలకు చేరకుండా, అర్హత కలిగిన నిరుద్యోగులకు అధికారుల ద్వారా అందాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం నిరుద్యోగ యువతకు అందించే గొప్ప అవకాశమని వారు అభిప్రాయపడ్డారు.
Similar News
News November 5, 2025
GWL: దాసరి బీసన్న పోరాటానికి ఫలితం

ఎర్రవల్లి కి చెందిన దాసరి బీసన్న గ్రామాల్లో తిరుగుతూ చిన్నపాటి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించాడు. వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు గద్వాల మహేంద్ర షో రూమ్‌లో ఓ వాహనాన్ని కొనుగోలు చేశాడు. ఆ వాహనం కొద్ది రోజులకే మొరాయించింది. వాహనాన్ని మార్చాలని షోరూమ్ ఎదుట కుటుంబ సభ్యులతో ఆందోళన చేశాడు. వారికి ప్రజాసంఘాలు మద్దతు పలికాయి. ఎట్టకేలకు మంగళవారం షోరూం నిర్వాహకులు అతడికి కొత్త వాహనాన్ని అందజేశారు.
News November 5, 2025
జగన్‌లో నానాటికి పైశాచికత్వం పెరుగుతుంది: ప్రత్తిపాటి

జగన్ రైతుల నమ్మకానికి అనర్హుడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. చిలకలూరిపేటలో మంగళవారం ఆయన కార్యాలయంలో మాట్లాడారు. రైతులు, వ్యవసాయం గురించి జగన్ మాట్లాడుతుంటే నాగలి నవ్వుతుందని, నేలతల్లి బోరు మంటుందన్నారు. చంద్రబాబు నాయకత్వం పటిమతో ఏపీకి వస్తున్న పెట్టుబడులు, పరిశ్రమలతో జగన్‌లో నానాటికి పైశాచికత్వం పెరుగుతుందన్నారు.
News November 5, 2025
కార్తీక పౌర్ణమికి నదీ స్నానాలకు వెళ్లే వారు జాగ్రత్త: ఎస్పీ

కార్తీక పౌర్ణమికి నది స్నానాలకు వెళ్లే జిల్లాలోని భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మంగళవారం కోరారు. నదీ స్నానాలు, దేవాలయాల సందర్శ నల విషయంలో భక్తులు తప్పక పాటించాల్సిన కీలక సూచనలను ఎస్పీ విడుదల చేశారు. భారీ వర్షాల కారణంగా నదుల్లో ప్రవాహం ఉద్ధృతంగా ఉందని, లోతు లేని సురక్షిత ప్రాంతంలోనే స్నానం చేయాలన్నారు. సుడులు తిరిగే ప్రాంతాలకు వెళ్లకుండా దీపాలు నీటిలో వదలాలని సూచించారు.


