News April 1, 2025

వి.కోటలో పేలిన నాటు బాంబు.. ఒకరికి తీవ్ర గాయాలు

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా వి కోట మండలం కస్తూరి నగరానికి చెందిన ఖాదర్ బాషా (42) కు నాటు బాంబు పేలి తీవ్రంగా గాయపడ్డాడు. తన పొలం దగ్గర ఆవులకు గడ్డి వేయడానికి వెళ్లిన ఖాదర్ బాషా అక్కడ ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు వన్య మృగాలకు అమర్చిన నాటు బాంబు తొక్కడంతో అది పేలి కాలుకు తీవ్ర గాయమైంది. వెంటనే వికోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నాటు బాంబు అమర్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Similar News

News November 6, 2025

సిరిసిల్ల: ‘రవాణా చేసినా, అమ్మినా కఠిన చర్యలు తప్పవు’

image

గంజాయి రవాణా చేసినా, అమ్మినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ నటేశ్ అన్నారు. సిరిసిల్ల పరిధిలోని పాన్ షాప్, లాడ్జిలో గురువారం పోలీస్ జాగిలాలతో తనిఖీ నిర్వహించారు. ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మూలనేని లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో గంజాయి అమ్మినా, తాగినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News November 6, 2025

రాహుల్ ఆరోపించిన చోట కాంగ్రెస్‌కే అధిక ఓట్లు

image

హరియాణాలో భారీగా ఓటు చోరీ జరిగిందని నిన్న LoP రాహుల్ గాంధీ ECపై ఆరోపణలు గుప్పించడం తెలిసిందే. ములానా సెగ్మెంటు ఢకోలా గ్రామంలో ఒకే ఫొటో (బ్రెజిలియన్ మోడల్)తో 223 ఓట్లున్నట్లు చూపారు. అయితే 2024 పోలింగ్‌లో అక్కడ CONGకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల్లో BJPకి 275, CONGకు 602 ఓట్లు రాగా లోక్‌సభలో BJP కన్నా CONGకు 392 ఓట్లు ఎక్కువొచ్చాయి. 2019తో పోలిస్తే 2024లో కాంగ్రెస్‌కే అధిక ఓట్లు పడ్డాయి.

News November 6, 2025

సిరిసిల్ల: ‘పనులు వేగవంతం చేయాలి’

image

పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్ అన్నారు. ఎంపీ లార్డ్స్‌తోపాటు వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా మంజూరైన నిధులతో మొదలుపెట్టిన పనుల ప్రగతిపై జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఆమె సమీక్ష నిర్వహించారు. గ్రామపంచాయతీ, అంగన్‌వాడి భవన నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.