News April 1, 2025
సామర్లకోటలో క్షుద్ర పూజలు కలకలం

సామర్లకోట శివారు బ్రౌన్ పేట కందకం ప్రాంతంలో క్షుద్ర పూజలు కలకలం ఏర్పడింది. ఇంటి ముందు స్టార్ తరహాలో ముగ్గు వేసి, పసుపు, కుంకుమ మధ్యలో నిమ్మకాయలు ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది. గుర్తు తెలియని వ్యక్తులు ప్రజలను వేధించేందుకు ఇలా చేస్తున్నట్లు స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. కొద్దిపాటి అనారోగ్యం వచ్చినా క్షుద్ర పూజల ప్రభావం అనే భావన ప్రజల్లో నెలకొంది.
Similar News
News January 12, 2026
NZB: 35 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమిషనర్

నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 35 ఫిర్యాదులను CP సాయి చైతన్య స్వీకరించారు. వాటికి సంబంధించిన పోలీస్ స్టేషన్ల SI, CIలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని కనుక్కుని పరిష్కారానికి సూచనలు చేశారు. కాగా ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నట్టు CP చెప్పారు.
News January 12, 2026
వికారాబాద్: ఎన్నికలకు సిద్ధం కండి: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 12న ఓటర్ లిస్ట్ తుది జాబితా విడుదల చేయడం జరుగుతుందన్నారు. పోలింగ్ కేంద్రాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
News January 12, 2026
జనగామ: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం: DY.CM

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి మంత్రులు, అధికారులతో కలిసి జిల్లాల కలెక్టర్లతో డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జనగామ జిల్లా నుంచి వీసీలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తదితరులు పాల్గొన్నారు.


