News April 1, 2025

గోదావరిలో దూకేసిన వ్యక్తి మృతదేహం లభ్యం

image

అప్పుల భారంతో అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామంలోని వైనతేయ వారధిపై కారును నిలిపి గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న అమలాపురానికి చెందిన చోడపనీడి వెంకటేశ్వరరావు (61) మృతదేహం సోమవారం లభ్యమైంది. అంబాజీపేట మండలం తొండవరం గ్రామ పరిధిలో గోదావరి నది ఒడ్డున అతని మృతదేహాన్ని గుర్తించారు. వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అల్లవరం పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు.

Similar News

News October 27, 2025

కాఫీ పొడితో కళకళలాడే ముఖం

image

కాఫీ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలుంటాయన్న విషయం తెలిసిందే. అయితే కాఫీపొడి చర్మసంరక్షణలోనూ ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. కాఫీపొడి ఫేస్ ప్యాక్‌లతో ముఖంపై ఉండే మొటిమ‌లు, ముడ‌త‌లు, మచ్చ‌లు తొల‌గిపోయి చర్మం కాంతిమంతంగా మారుతుంది. * స్పూన్ కాఫీపొడిలో కాస్త తేనె క‌లిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. పావుగంట తర్వాత క్లీన్ చేసుకుంటే చర్మం మెరిసిపోతుంది. ✍️మరిన్ని బ్యూటీటిప్స్ కోసం <<-se_10014>>వసుధ<<>> కేటగిరీకి వెళ్లండి.

News October 27, 2025

ఎయిమ్స్ రాయ్‌బరేలిలో 149 పోస్టులు

image

రాయ్‌బరేలిలోని<> ఎయిమ్స్ <<>>149 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు NOV 3న రిపోర్టింగ్ చేయాలి. NOV 4, 28న డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. DEC 12న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. పోస్టును బట్టి MD/MS/DNB/DM ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://aiimsrbl.edu.in/

News October 27, 2025

తేమ 12% కంటే ఎక్కువ ఉంటే రూ. 6,950: కలెక్టర్

image

మార్కెట్‌ యార్డులో కొనుగోళ్లు నిలిచిపోవడంతో పత్తి రైతుల సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్‌ రాజర్షి షా చొరవ తీసుకున్నారు. సోమవారం ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, వ్యాపారస్తులతో కలిసి రెండు గంటలు సమీక్షించారు. తేమ శాతం 12% కంటే ఎక్కువ ఉన్నా, ప్రైవేటు వ్యాపారుల ద్వారా క్వింటాలుకు ₹6,950 చెల్లించేలా ఒప్పందం కుదిరిందని కలెక్టర్‌ తెలిపారు. దీంతో రైతులకు ఊరట లభించింది.