News April 1, 2025

కృష్ణా: ‘పరీక్ష తర్వాత పేపర్లు చించకూడదు’

image

10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మంగళవారం నిర్వహించే సోషల్ పరీక్షతో ముగిస్తాయి. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచినీరు ఏర్పాటు చేయాలని డీఈవో రామారావు ఓ ప్రకటనలో తెలిపారు. ఆఖరి పరీక్ష కావడంతో విద్యార్థులు పరీక్షా అనంతరం పుస్తకాలు చించి వేసి బయట వేయడం వంటివి చేయకుండా పాఠశాల యాజమాన్యాలు అవగాహన కల్పించాలన్నారు. 

Similar News

News April 3, 2025

విజయవాడ: మహిళ హత్య.. నిందితుడి అరెస్ట్

image

పటమటలో మంగళవారం రాత్రి జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పటమట పోలీసుల వివరాల ప్రకారం.. లక్ష్మి అనే మహిళ తన భర్తతో కలిసి కాగితాలు ఏరుకొని జీవనం సాగించేది. వాంబే కాలనీకి చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి లక్ష్మిని శారీరకంగా కలవాలని బలవంతం చేశాడు. ఒప్పుకోకపోవడంతో మంగళవారం రాత్రి మద్యం తాగి విచక్షణారహితంగా అత్యాచారం చేసి హత్య చేసినట్లు తెలిపారు.

News April 3, 2025

VJA: మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

image

భార్య మాట వినటంలేదని మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్తపేట పోలీసుల కథనం మేరకు.. జక్కంపూడికి చెందిన అనిల్ కుమార్ తాపీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య ఓ బైండింగ్ షాప్‌లో పనిచేస్తూ ఉంటుంది. భార్యను పనికి వెళ్లవద్దంటూ అనిల్ కుమార్ హెచ్చరిస్తూ ఉన్నాడు. అయినా ఆమె పనికి వెళ్లడంతో బుధవారం ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 3, 2025

పెనమలూరులో వ్యాపారి కిడ్నాప్.. కాపాడిన పోలీసులు

image

పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం హైడ్రామ చోటుచేసుకుంది. పోరంకి నారాయణపురం కాలనికి చెందిన వెంకటేశ్వరరావును, వ్యాపార విభేదాల నేపథ్యంలో భాగస్వామి రాజు తన అనుచరులతో కలిసి కిడ్నాప్ చేశాడు. ఈ విషయాన్ని గమనించిన ఆయన కుమార్తె పోలీసులకు సమాచారం అందించడంతో, వారు అప్రమత్తమై వెంటనే అతడిని కాపాడి కిడ్నాప్‌కు ముగింపు పలికారు.

error: Content is protected !!