News April 1, 2025

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్‌.. జనగామ జిల్లా మహిళా మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్‌లో జనగామ జిల్లాకు చెందిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ భాను మృతి చెందారు. రేణుకది దేవరుప్పుల మండలం కడవెండి. గ్రామంలో ఆమె మృతిపై తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆమె మరణాన్ని నిరసిస్తూ భావోద్వేగంతో స్పందిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాల కోసం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Similar News

News November 2, 2025

VZM: బస్సు చక్రాల కింద నలిగిన బతుకు

image

గంట్యాడ మండలం కొత్తవెలగాడ జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చౌడవాడ దాలినాయుడు(70) మృతి చెందాడు. మృతుడు తన స్వగ్రామం కొత్తవెలగాడ నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు బస్సు ఎక్కేందుకు ప్రయత్నించే సమయంలో బస్సు ముందు చక్రం కింద పడ్డాడు. తల నుజ్జై అక్కడికక్కడే మృతి చెందాడు. గంట్యాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు.

News November 2, 2025

సంగెం: గుంతలో పడి వృద్ధుడి మృతి

image

సంగెం మండలం లోహిత గ్రామంలోని నల్లాల గేట్‌వాల్ సమీపంలో ఉన్న గుంతలో పడి గుర్తు తెలియని వృద్ధుడు (సుమారు 60 ఏళ్లు) మృతి చెందాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి గుర్తింపు కోసం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

News November 2, 2025

రాజకీయ హింస.. ఏడాదిలో 281 మంది మృతి

image

విద్యార్థుల ఆందోళనలతో బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా అధికారం కోల్పోయినప్పటికీ పొలిటికల్ వయలెన్స్ కొనసాగుతూనే ఉంది. గత ఏడాది AUG నుంచి ఈ ఏడాది SEP వరకు అల్లర్లలో 281 మంది మరణించారని మానవ హక్కుల సంఘం వెల్లడించింది. అలాగే అక్రమ నేరారోపణలతో 40 మంది చట్టవిరుద్ధ హత్యలకు గురయ్యారని తెలిపింది. మరో 153 మందిని దారుణంగా ఉరితీశారని పేర్కొంది. లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు జవాబుదారీగా ఉండటం లేదని అభిప్రాయపడింది.