News April 1, 2025
INDvsENG: ప్రతిష్ఠాత్మక ట్రోఫీకి రిటైర్మెంట్!

ప్రతిష్ఠాత్మక పటౌడీ ట్రోఫీకి రిటైర్మెంట్ ప్రకటించేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సిద్ధమవుతోంది. భారత్, ఇంగ్లండ్ మధ్య ఇంగ్లండ్‌లో జరిగే టెస్టు సిరీస్‌ను 2007 నుంచి పటౌడీ ట్రోఫీ పేరిట నిర్వహిస్తోంది. ఇకపై ఇరు దేశాల్లోని ఇతర దిగ్గజాల పేరిట సిరీస్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. జూన్-జులై మధ్య జరిగే సిరీస్ నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చే అవకాశముంది. IND తరఫున 46 టెస్టులు ఆడిన పటౌడీ 2011లో మరణించారు.
Similar News
News January 24, 2026
తెలుగు వెండితెర ‘కాంచనమాల’ వర్ధంతి నేడు

తెలుగు చలనచిత్ర తొలితరం అందాల తార చిట్టాజల్లు కాంచనమాల (1917–1981) వర్ధంతి నేడు. 1917, మార్చి 5న ఉమ్మడి గుంటూరు (D) అమృతలూరు(M) కూచిపూడిలో జన్మించారు. 1935లో ‘శ్రీకృష్ణ తులాభారం’తో తెరంగేట్రం చేసిన ఆమె, తన అద్భుత నటనతో ‘ఆంధ్రా గ్రేటా గార్భో’గా పేరు తెచ్చుకున్నారు. ‘మాలపిల్ల’ (1938) చిత్రం ఆమెకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. గృహలక్ష్మి, వందేమాతరం, బాలనాగమ్మ వంటి చిత్రాల్లో ఆమె నటన చిరస్మరణీయం.
News January 24, 2026
పులిపిర్లకు ఇలా చెక్

వివిధ అనారోగ్య సమస్యలు, వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల చాలామందిలో పులిపిర్లు వస్తుంటాయి. అవి తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి. • దూదిని యాపిల్ సిడర్ వెనిగర్‌లో ముంచి పులిపిర్లు ఉన్న చోట అద్దితే పూర్తిగా తగ్గిపోతాయి. • ఆముదంలో కాస్త బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపాలి. దాన్ని పులిపిర్లపై రాసి బ్యాండేజ్ వేయాలి. అలా రాత్రంతా ఉంచుకుని ఉదయాన్నే కడిగేయాలి. ఇలా రెండు మూడు రోజులు చేస్తే పులిపిర్లు పూర్తిగా తొలగిపోతాయి.
News January 24, 2026
ఉద్యోగులకు షాక్.. డుమ్మా కొడితే ఇంటికే!

TG: డ్యూటీకి రెగ్యులర్‌గా రాని ప్రభుత్వ ఉద్యోగులపై సర్కార్ ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. పర్మిషన్ లేకుండా ఏడాదికి మించి విధులకు దూరంగా ఉంటే నేరుగా సర్వీసు నుంచి తొలగించేలా నిబంధనలను సవరించింది. ఈ మేరకు ‘తెలంగాణ సివిల్ సర్వీసెస్ రూల్స్’ను మారుస్తూ CS ఉత్తర్వులు జారీ చేశారు. వరుసగా ఐదేళ్లు సెలవులో ఉన్నా, అనుమతి లేని ఫారిన్ సర్వీసులో కొనసాగినా వేటు తప్పదు. ముందు ఉద్యోగికి షోకాజ్ నోటీస్ ఇస్తారు.


