News March 26, 2024
ఆస్పరి: చేతి గుర్తు రక్తపు మరకలు

ఆస్పరిలోని బొరుగుల బట్టి యజమాని ఇంటి ఆవరణలో చేతి గుర్తు ఉండే రక్తపు మరకలు, పక్కనే RCM చర్చి ఆవరణలోని వెనుక భాగంలో రక్తం మడుగులా ఉండటంతో CI హనుమంతప్ప సోమవారం పరిశీలించారు. ఆ రక్తపు మడుగును చీపురుతో కడిగే ప్రయత్నం చేశారని, అక్కడే సబ్బు ముక్కలు ఉన్నాయని తెలిపారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో విచారణ చేపట్టామని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. రక్తం మనిషిదా? జంతువుదా? తేలాల్సి ఉంది.
Similar News
News March 15, 2026
కర్నూలు జిల్లా ప్రజలకు ఎస్పీ హెచ్చరిక

ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా డిస్కౌంట్లు, బహుమతుల పేరుతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రజలను హెచ్చరించారు. సోషల్ మీడియా, వాట్సాప్‌లలో వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని, గుర్తుతెలియని వ్యక్తులకు బ్యాంక్ వివరాలు లేదా OTPలు చెప్పవద్దని సూచించారు. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని వారు తెలిపారు.
News March 15, 2026
ప్రతి ఒక్కరినీ అక్షరాస్యులుగా చేయడమే లక్ష్యం: కలెక్టర్

ప్రతి ఒక్కరినీ అక్షరాస్యులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యని కర్నూలు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. ఆదివారం కర్నూలులోని శ్రీరామ్ నగర్‌లో ఉన్న నగర పాలక ప్రాథమిక పాఠశాలలో అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా అభ్యాసకులకు నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద అన్ని మౌలిక సదుపాయాలని కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు.
News March 15, 2026
కర్నూలు: నకిలీ మెసేజ్‌లతో జాగ్రత్త!

విద్యుత్ బిల్లుల పేరుతో వినియోగదారులకు వస్తున్న నకిలీ సందేశాలను నమ్మవద్దని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి సూచించారు. బిల్లు బకాయి ఉందని, వెంటనే చెల్లించకపోతే విద్యుత్ నిలిపివేస్తామని హెచ్చరిస్తూ కొందరికి నకిలీ మెసేజ్‌లు వస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి సందేశాలను నమ్మి ఎవరూ మోసపోవద్దని కోరారు. విద్యుత్ సేవలకు సంబంధించిన సమాచారం అధికారిక మార్గాల్లోనే అందిస్తామని చెప్పారు.


