News April 1, 2025

ALERT: నేడు రాష్ట్రంలో వడగళ్ల వాన

image

TG: నేటి నుంచి 3 రోజులపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 km వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేసింది. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని పేర్కొంది. గద్వాల్, వనపర్తి, నారాయణపేట్, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో వడగళ్లతో కూడిన వర్షం కురుస్తుందని అంచనా వేసింది.

Similar News

News April 3, 2025

‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ మీట్‌కు చీఫ్ గెస్ట్‌గా NTR

image

నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ రేపు సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించనున్నారు. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా వస్తున్నట్లు ప్రకటించారు. తారక్ తన సినిమాలను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంటారని తెలియజేస్తూ నిర్మాత నాగవంశీ Xలో స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు.

News April 3, 2025

కంచ భూములపై ఫేక్ వీడియోలు.. BRS IT సెల్ ఇంచార్జిలపై కేసు

image

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని కంచె భూములను ప్రభుత్వం చదును చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, అక్కడి పరిస్థితులను తప్పుదోవ పట్టించేలా కొన్ని ఫొటోలు, వీడియోలు ఎడిట్ చేసి సర్క్యులేట్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈక్రమంలో గచ్చిబౌలి పోలీసులు ఫేక్ వీడియోలను క్రియేట్ చేశారనే ఆరోపణలపై BRS IT సెల్ ఇంచార్జ్‌లు క్రిశాంక్ & కొణతం దిలీప్‌లపై కేసు నమోదు చేశారు.

News April 3, 2025

HCU కంచ భూములపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

image

TG: కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల కొట్టివేతపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు చెట్లు నరికివేయొద్దని, భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన మధ్యంతర నివేదికపై విచారణ సందర్భంగా SC కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఇది చాలా సీరియస్ విషయం. చట్టాన్ని మీరు ఎలా చేతుల్లోకి తీసుకుంటారు’ అని CSపై ఆగ్రహిస్తూ ప్రతివాదిగా చేర్చింది.

error: Content is protected !!