News April 1, 2025

ప్రకాశం: నేటి నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభం

image

జిల్లాలో నేటి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం తరగతులు ప్రారంభిస్తున్నట్లు ప్రకాశం జిల్లా అధికారులు తెలిపారు. ఏప్రిల్ 7వ తేదీ నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఏప్రిల్ 7 నుంచి మే 31వ తేదీ వరకు ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చని తెలిపారు. జూన్ 1 నుంచి ప్రారంభం కావలసిన ఇంటర్ తరగతులు ఈ ఏడాది 2 నెలల ముందే ప్రారంభమయ్యాయి.

Similar News

News April 3, 2025

వెలిగండ్ల: ఇమ్మడి చెరువు సర్పంచ్ ఆత్మహత్య

image

వెలిగండ్ల మండలంలోని ఇమ్మడి చెరువు గ్రామ సర్పంచ్ తోకల బాలకృష్ణ(37) గురువారం ఉదయం బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన వైసీపీ తరఫున సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. బాలకృష్ణ మృతి పట్ల మండలంలోని పలువురు వైసీపీ నాయకులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 3, 2025

ఒంగోలు: 15 ఏళ్ల బాలికపై లైంగిక దాడి

image

పెళ్లి చేసుకుంటానని నమ్మించి 15 ఏళ్ల బాలికపై ఓ యువకుడు పలుమార్లు లైంగిక దాడి చేశాడు. ఈ ఘటన ఒంగోలులోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. నానమ్మ వద్ద ఉంటున్న బాలికకు యువకుడు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. బాలికకు అనారోగ్యంగా ఉండటంతో జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు గర్భవతిగా తేల్చారు. దీంతో బాలిక నానమ్మ ఒంగోలు వన్ టౌన్‌లో ఫిర్యాదు చేసింది.

News April 3, 2025

ఒంగోలు: నేటి నుంచి 10th స్పాట్ వ్యాల్యువేషన్

image

10th పబ్లిక్ పరీక్షలు ఈ నెల 1వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. కాగా గురువారం నుంచి 10th స్పాట్ వ్యాల్యువేషన్ నిర్వహిస్తున్నట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని డీఆర్ఆర్ మున్సిపల్ హై స్కూల్‌లో స్పాట్ వ్యాల్యువేషన్ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సోషల్ స్టడీస్‌కు సంబంధించిన టీచర్స్‌కు శుక్రవారం నుంచి ప్రారంభమవుతాయని, మిగిలిన సబ్జెక్టులకు ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయని తెలిపారు.

error: Content is protected !!