News March 26, 2024

కోటబొమ్మాళి: చేపల వ్యాను బోల్తా

image

జాతీయ రహదారిపై కొత్తపేట కూడలి వద్ద ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళంవైపు చేపలలోడుతో వెళ్తున్న వ్యాను టైరుపంక్చర్ కావడంతో సోమవారం బోల్తా పడింది. ఆక్సిజన్ సిలెండర్లు, నీటి ట్యాంకులు చెల్లాచెదురుకావడంతో చేపలు రహదారి పక్కన పడిపోయాయి. వాటిని ఏరుకునేందుకు స్థానికులు పోటీపడ్డారు. హైవే సిబ్బంది అక్కడికి చేరుకుని ట్రాఫిక్ సమస్య రాకుండా చర్యలు చేపట్టారు. వాహనంలో డ్రైవర్‌, మరోవ్యక్తి గాయాలు కాలేదు.

Similar News

News July 5, 2024

శ్రీకాకుళం: జాబ్ మేళా.. 16 మంది ఎంపిక

image

శ్రీకాకుళం నగరంలోని స్థానిక ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో జిల్లా ఉపాధి అధికారి సుధా ఆధ్వర్యంలో శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో ఓ ప్రైవేట్ కంపెనీ యాజమాన్యం ఇంటర్వ్యూలు నిర్వహించగా.. నిరుద్యోగ యువత 88 మంది హాజరయ్యారు. ఇందులో 16 మందిని ఎంపిక చేసి, వారికి ఉపాధి కల్పించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సుధా తెలిపారు.

News July 5, 2024

శ్రీకాకుళం: నేటితో ముగుస్తున్న ఫీజు చెల్లింపు గడువు

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ డిగ్రీ చివరి ఏడాది 5వ సెమిస్టర్ ఇన్స్టంట్ ఎగ్జామ్ ఫీజు చెల్లింపు గడువు నేటితో ముగియనుంది. విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు జూన్ 29 నుంచి అవకాశం ఇచ్చారు. ఇప్పటికే ఈ పరీక్షకు అర్హులైన జాబితాను ఆయా కళాశాలలకు అధికారులు అందజేశారు. ఇంకా చెల్లించని విద్యార్థులు నేడు సాయంత్రం లోగా చెల్లించవచ్చని అధికారులు తెలిపారు.

News July 5, 2024

శ్రీకాకుళం: అధికారులు అంకిత భావంతో పనిచేయాలి

image

అధికారులు అంకిత భావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ జి.ఆర్. రాధిక, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్‌లతో కలిసి జిల్లా అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అర్హత కలిగిన ప్రతీ లబ్ధిదారునికి అందించే దిశగా అంకితభావంతో విధులు నిర్వహించాలని ఆదేశించారు.