News April 1, 2025

KPHBలో సిద్దిపేట యువకుడి సూసైడ్

image

ప్రేమ విఫలం కావడంతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. KPHB PS పరిధిలో సోమవారం సాయంత్రం ఈ విషాదం వెలుగుచూసింది. అడ్డగుట్టలోని PG హాస్టల్లో నివాసం ఉంటున్న మహేందర్(25) ఇటీవల జాబ్‌కు రిజైన్ చేశాడు. ‘నేను ప్రేమలో విఫలమయ్యాను. అమ్మా.. నాన్నా క్షమించండి’ అంటూ లెటర్ రాసి ఉరేసుకున్నాడు. మృతుడు సిద్దిపేట జిల్లావాసి.

Similar News

News November 13, 2025

సూర్యాపేట: వేతనాలు విడుదల చేయాలి: పీఆర్టీయూ

image

2008 డీఎస్సీ కాంట్రాక్టు ఉపాధ్యాయుల వేతనాలు చెల్లించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు తంగేళ్ల జితేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం సూర్యాపేట జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ఉపాధ్యాయ వేతనాల విడుదలకు డైరెక్టరేట్ నుంచి విడుదలైన జీవోను డీటీఓకు అందజేశారు. ఎస్టీఓలకు ఆదేశాలు జారీ చేసి వేతనాలు విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ అధ్యక్షుడు గోదేశి దయాకర్, ఫోరం అధ్యక్షుడు కోట రమేష్ పాల్గొన్నారు.

News November 13, 2025

నవాబుపేట: వ్యక్తిని చంపి కాల్చేశారు

image

MBNR జిల్లా నవాబుపేట మండలం యన్మన్‌గండ్ల గేటు వద్ద గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. గేటు పరిసర ప్రాంతాలలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని హత్య చేసి కాల్చడంతో పూర్తిగా గుర్తుపట్టలేని విధంగా తయారైంది. ఈ హత్య ఘటన పరిసర ప్రాంతాలలో చర్చనీయాంశంగా మారింది.

News November 13, 2025

కరీంనగర్: నవంబర్ 15న ప్రత్యేక లోక్ అదాలత్

image

జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 15న ప్రత్యేక లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ కె. రాణి తెలిపారు. ఈ అదాలత్‌లో క్రిమినల్, సివిల్, చెక్ బౌన్స్, మోటార్ ప్రమాద పరిహార వంటి కేసులు ఇరుపక్షాల రాజీతో పరిష్కరించబడతాయని చెప్పారు. రాజీపడదగిన వారు సంబంధిత పోలీసు వారిని సంప్రదించాలని ఆమె సూచించారు.