News April 1, 2025

పల్నాడు: రూ.54.9 కోట్లతో హైవే రోడ్డు పనులు 

image

పల్నాడు జిల్లాలో హైవే రోడ్డు-167కు సంబంధించి కేంద్రం రూ.54.9 కోట్లు మంజూరు చేసింది. హైవే రోడ్డు నడికుడితో పాటు మార్కాపురం మీదగా వెళుతుంది. పూర్తిస్థాయిలో నిధులు అందకపోవడంతో రోడ్డు పనులు మధ్యలో ఆగాయి. హైవే రోడ్డుకు సంబంధించి విడుదలైన నిధులతో మాచర్ల, రెంటచింతల, పాల్వాయి గేటు, గురజాల మండలాలకు సంబంధించి ఫ్లై ఓవర్లు రైల్వే క్రాసింగ్‌ల వద్ద నిర్మించనున్నారు. నిధులపై జిల్లా ఎమ్మెల్యేలు హర్షం తెలిపారు. 

Similar News

News January 4, 2026

కురుపాం: చికిత్స పొందుతూ యువకుడు మృతి

image

కురుపాం(M) పి.లేవిడి గ్రామానికి చెందిన వి.అజిత్ కుమార్ (23) గత నాలుగు రోజులుగా కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు.స్థానికుల వివరాలు మేరకు..గత నెల 31న గుమ్మలక్ష్మీపురం(M)బొద్దిడి సమీపంలో గ్యాస్ వ్యాన్‌ను బైక్ ఢీకొని ప్రమాదం జరిగిందన్నారు. ఈ ప్రమాదంలో అజిత్ కుమార్‌కు తీవ్ర గాయాలవ్వడంతో చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి కుటుంబీకులు తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ మరణించాడు.

News January 4, 2026

కూరగాయల పంట పెరిగింది: మాధవి

image

ఉద్యానశాఖ చేపట్టిన చర్యల వల్ల గతేడాది సీజన్ 767 ఎకరాలుగా ఉన్న కూరగాయల విస్తీర్ణం ఈ ఏడాదిలో 1,458 ఎకరాలకు పెరిగిందని జిల్లా ఉద్యానవన అధికారి మాధవి తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో కూరగాయల సాగు చేసే రైతులు 1,710 మంది వరకు ఉన్నారన్నారు. కూరగాయల సాగు కోసం మల్చింగ్ షీట్ వేసిన రైతులకు ఎకరానికి రూ.8వేలు ఆర్థిక సహాయం అందజేస్తున్నామన్నారు.

News January 4, 2026

విశాఖ: ప్రభుత్వ కార్యాలయాలలో రేపు పీజీ‌ఆర్ఎస్

image

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహిస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీ జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.