News April 1, 2025
పల్నాడు జిల్లాలో పన్నుల వసూళ్లు ఇలా

పల్నాడు జిల్లాలో మున్సిపాలిటీలు పన్నుల వసూళ్లను వేగవంతం చేశాయి. జిల్లా కేంద్రమైన నరసరావుపేట పురపాలక సంఘంలో 54.42 శాతం, వినుకొండలో 82.22 శాతం, సత్తనపల్లిలో 58.83%, మాచర్లలో 53%, పిడుగురాళ్లలో 69%, దాచేపల్లిలో 64%, గురజాలలో 65% పన్నులు వసూలు అయ్యాయి. మార్చి నెల ముగిసిపోవడంతో పన్నులకు సంబంధించి వడ్డీ రాయితీని ప్రకటించినప్పటికీ నూటికి 100 శాతం పన్నులను చెల్లించలేదు.
Similar News
News September 14, 2025
మినరల్ వాటర్ తాగిన వారికీ డయేరియా.. కారణం ఇదే!

విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ పరిధిలోని డయేరియా కేసుల వ్యాప్తి నేపథ్యంలో పలు RO ప్లాంట్లను అధికారులు పరిశీలించారు. నీటిలో ఉండే ప్రమాదకర బ్యాక్టీరియాను తొలగించే UV LAMP అనేక చోట్ల లేదని గుర్తించారు. దీని విలువ రూ. 25 వేల వరకు ఉంటుందట. దీంతో అంత ఖర్చు మనకెందుకు అన్నట్లు RO ప్లాంట్ల నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నీటిలో బ్యాక్టీరియా ప్రబలి డయేరియా బారిన పడ్డట్లు ప్రజలు అంటున్నారు.
News September 14, 2025
రేపు MGU 4వ స్నాతకోత్సవం

నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ 4వ స్నాతకోత్సవానికి సిద్ధమైంది. సోమవారం యూనివర్సిటీలో నిర్వహించే స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ స్నాతకోత్సవంలో 22 మంది రీసెర్చ్ స్కాలర్స్‌కు PHD పట్టాలు, 57 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేయనున్నారు. యూనివర్సిటీ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మొత్తంగా 150 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ లభించాయి.
News September 14, 2025
NLG: రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్

జిల్లాలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యటన నేపథ్యంలో రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దయినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో అధికారుల సమీక్ష రద్దు చేసినట్లు వెల్లడించారు. ప్రజలు రేపు ఫిర్యాదుల కోసం కలెక్టరేట్‌కు రావద్దని ఆమె కోరారు. వచ్చే సోమవారం ప్రజావాణి యథావిధిగా జరుగుతుందని పేర్కొన్నారు.