News April 1, 2025

అనంతపురం జిల్లాలో 7 కరవు మండలాలు.!

image

రబీ సీజన్‌లో ప్రభుత్వం ప్రకటించిన కరవు మండలాల జాబితాలో అనంతపురం జిల్లాలో మండలాలకు స్థానం లభించింది. 2024-25 రబీ సీజన్‌లో కరవు ప్రభావిత మండలాలను సోమవారం ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో బెళుగుప్ప, గుంతకల్లు, పెద్దవడుగూరు, తాడిపత్రి, ఎల్లనూరు, యాకిడి, విడపనకల్లు మండలాలకు స్థానం లభించింది. మిగతా మండలాలకు ఈ జాబితాలో చోటు దక్కలేదు.

Similar News

News February 25, 2026

గుంతకల్లు డివిజన్‌లో ఖాళీల భర్తీకి కసరత్తు

image

సౌత్ సెంట్రల్ రైల్వే గుంతకల్లు డివిజన్‌లో పాయింట్స్ మెన్ ఖాళీల భర్తీ కోసం 16 మంది మాజీ సైనికులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. రూ.18,000 వేతనం, ఇతర భత్యాలు చెల్లించనున్నారు. మాజీ సైనికులు మార్చి 6వ తేదీ లోపు దరఖాస్తులను గుంతకల్లు డివిజన్ కార్యాలయానికి సమర్పించాలన్నారు. మరిన్ని వివరాల కోసం 08554 241146 సంప్రదించవచ్చన్నారు.

News February 24, 2026

తాడిపత్రిలో కారు బీభత్సం.. 2 భాగాలుగా విడిపోయిన ట్రాక్టర్ ఇంజిన్

image

తాడిపత్రి మండలంలో కారు బీభత్సం సృష్టించింది. రూరల్ పరిధిలోని ఆర్డీటీ కాలనీ సమీపంలో ట్రాక్టర్‌ను కారు ఢీకొంది. ప్రమాదంలో ట్రాక్టర్ ఇంజిన్ భాగాలు రెండుగా విడిపోయాయి. కారుకు సేఫ్టీ బెలూన్స్ ఓపెన్ కావడంతో కారులో ఉన్న వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు. ట్రాక్టర్ డ్రైవర్‌కు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News February 24, 2026

జిల్లాలో వేగవంతంగా శనగల కొనుగోలు ప్రక్రియ

image

జిల్లాలో శనగల కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ పేర్కొన్నారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కొనుగోలు కమిటీ (DLPC) సమావేశం జరిగింది. క్వింటా శనగ రూ.5,875 మద్దతు ధరను నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా పంట సేకరణ కోసం ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీలను ఖరారు చేశామన్నారు.