News March 26, 2024

ఐటీ ఉద్యోగం చేస్తున్నారా? షాకింగ్ న్యూస్!

image

ఐటీ ఉద్యోగుల్లో చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు HCL హెల్త్ కేర్ తెలిపింది. దేశవ్యాప్తంగా 56వేల మందికి మెడికల్ టెస్టులు చేయగా, 77% మందికి అనారోగ్య సమస్యలు ఉన్నట్లు తేలింది. 22% మంది ఊబకాయం, 17% ప్రిడయాబెటిస్, 11% రక్తహీనతతో బాధపడుతున్నారని వెల్లడైంది. జంక్ ఫుడ్స్, గంటల కొద్దీ కదలకుండా కూర్చోవడం, సరైన డైట్ పాటించకపోవడం, నిద్రలేమి, ఆల్కహాల్, సిగరెట్ల వల్ల సంతానలేమి సమస్యా పెరుగుతోందట.

Similar News

News March 9, 2026

ఇరాన్‌పై దాడులు.. ఆ ఒక్క దీవిని US టచ్ చేయట్లేదు!

image

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా భీకర దాడులకు పాల్పడుతున్నా ఆ దేశంలోని ఖర్గ్ దీవిని మాత్రం టచ్ చేయట్లేదు. ఇరాన్‌ తీరానికి 25KM దూరంలో ఉన్న దీవి భారీ చమురు నిల్వలకు నిలయం. ఒక్కరోజే ఇక్కడ 7M బ్యారెళ్ల చమురును భద్రపరచొచ్చు. ఇరాన్ క్రూడ్ ఎగుమతుల్లో ఈ దీవి వాటా 90%. దీని మీద దాడి చేస్తే ఇరాన్‌కే కాకుండా గల్ఫ్ మొత్తానికి భారీ నష్టం వాటిల్లుతుంది. చమురు సరఫరా వ్యవస్థ దెబ్బతిని ధరలు భారీగా పెరుగుతాయి.

News March 9, 2026

ఆ తేదీల్లో రికమండేషన్ లెటర్లు అంగీకరించం: TTD

image

AP: తిరుమల ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఉగాది ఆస్థానం సందర్భంగా ఈ నెల 17, 19 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు TTD తెలిపింది. ఈ క్రమంలో 16, 18 తేదీల్లో ఎంపీ, ఎమ్మెల్యేల రికమండేషన్ లెటర్లు అంగీకరించబోమని పేర్కొంది. అయితే వీఐపీ ప్రొటోకాల్ దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పింది.

News March 9, 2026

ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్?.. మస్క్ రియాక్షన్ ఇదే

image

సూరత్‌(గుజరాత్‌)లో షాకింగ్ ఘటన జరిగింది. ‘ఎలా చనిపోవాలి? ఏ మందులు వాడాలి?’ అని ChatGPTలో అడిగి ఇద్దరు అమ్మాయిలు(18, 20ఏళ్లు) సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ఓ వ్యక్తి Xలో పోస్టు చేయగా ఎలాన్ మస్క్ yikes(ప్రమాదకరం, షాకింగ్) అంటూ రిప్లై ఇచ్చారు. అయితే ChatGPT, Gemini Ai సూసైడ్ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వట్లేదని పలువురు గుర్తుచేస్తున్నారు.