News April 1, 2025

నిర్మల్: వ్యవసాయ శాఖ అధికారుల కొత్త ఫోన్ నంబర్లు ఇవే

image

నిర్మల్ జిల్లా వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న డీఏవో, ఏడీఏ, ఏవోల ఫోన్ నంబర్లు నేటి నుంచి మారనున్నాయి. కొత్తగా ఎయిర్ టెల్ నెట్‌వర్క్ సిమ్‌లను సంబంధిత అధికారులకు అందజేశారు. ఇదివరకు ఉన్న ఫోన్ నంబర్లు పనిచేయవని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్ తెలిపారు. రైతులకు ఏవైనా సందేహాలు ఉంటే కొత్త నంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవాలని జిల్లా అధికారులు సూచిస్తున్నారు. పై ఫొటోలో నంబర్లు చూడొచ్చు.

Similar News

News November 13, 2025

నేడు దానధర్మాలు చేస్తే..?

image

గురువారం చాలామంది సాయిబాబాను పూజిస్తారు. అయితే ఆయన పూజతో పాటు నేడు దానధర్మాలు చేయడం ఎంతో శ్రేష్ఠమని పండితులు చెబుతున్నారు. పేదలకు ఆహారం, వస్త్రాలు దానం చేస్తే ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుందంటున్నారు. దానాలు చేస్తే సంపద పెరుగుతుందని హిందూ ధర్మ శాస్త్రం చెబుతోంది. ఇలా 9 వారాలు చేసి, సాయిబాబా ఆలయాన్ని దర్శించుకుంటే వృత్తి-వ్యాపారాలలో పురోగతి ఉంటుందని, కుటుంబంలో శాంతి లభిస్తుందని నమ్మకం.

News November 13, 2025

HYD: గెట్ రెడీ.. రేపే కౌంటింగ్

image

రేపు యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభంకానుంది. సెగ్మెంట్‌లో 4,01,365 ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,94,631(48.49%) మాత్రమే ఓటు వేశారు. 10 రౌండ్లు, 42 టేబుళ్ల మీద కౌంటింగ్ ఉంటుంది. షేక్‌పేటలోని 1వ బూత్‌తో మొదలై ఎర్రగడ్డలోని 407 బూత్‌తో కౌంటింగ్ ముగియనుంది. సీసీ కెమెరాల నిఘాలో ఈ ప్రక్రియ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల లోపు జూబ్లీహిల్స్ MLA ఎవరో తేలనుంది.

News November 13, 2025

గ్రేట్.. రాష్ట్రంలోనే నల్గొండకు రెండో స్థానం

image

జల్ సంచయ్ – జల్ భాగీదారీ పథకం కింద నల్గొండ జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచి అవార్డుకు ఎంపికైంది. ఈ నెల 18న రాష్ట్రపతి చేతుల మీదుగా కలెక్టర్ ఇలా త్రిపాఠి, డీఆర్డీవో శేఖర్ రెడ్డి అవార్డులో పాటు రూ.2 కోట్ల నగదు బహుమతిని అందుకోనున్నారు. అయితే జల సంరక్షణ కోసం తిరుమలగిరి సాగర్‌ (M)లో అత్యధికంగా 3,678 పనులు చేపట్టగా, నాంపల్లి (M)లో 3,628 పనులు చేశారు. జిల్లా వ్యాప్తంగా 84,827 పనులు చేపట్టారు.