News April 1, 2025
HYD ఊపిరి ఆగుతుందని స్లోగన్స్

HCUలో ప్రభుత్వ దమనకాండ అంటూ KBR పార్కు దగ్గర బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. ‘ప్రకృతిని కాపాడండి.. అది మనల్ని కాపాడుతుంది. HCU అడవిని నరికితే.. హైదరాబాద్ ఊపిరి ఆగుతుంది’ అంటూ బీఆర్ఎస్వీ నాయకులు నినాదాలు చేశారు. ఈ నిరసనకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ప్రకృతి ప్రేమికులు, మద్దతు తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం భూముల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News November 9, 2025
కార్తీకం: ఆదివారం ఎవరికిలా పూజ చేయాలి?

ఆదివారం సూర్యుడిని పూజించాలని చెబుతారు. సూర్యోదయానికి ముందే స్నానమాచరించి, సూర్యుడు రాగానే ‘ఓం ఆదిత్యా నమ:’ అంటూ ఆయన పేర్లను స్తుతించాలని పండితుల సూచన. ‘ప్రధాన ద్వారం వద్ద నెయ్యి దీపం వెలిగించాలి. బెల్లం, పాలు, ఎరుపు వస్త్రాలు దాయడం ఉత్తమం. ఉపవాసం మంచిదే. ఉప్పు-నూనె లేని ఆహారం తినవచ్చు. కార్తీకంలో ఈ నియమాల వల్ల సూర్యానుగ్రహంతో జాతకంలో సూర్యుని స్థానం బలపడి శాంతి, మనశ్శాంతి లభిస్తాయి’ అంటున్నారు.
News November 9, 2025
మహానంది క్షేత్రంలో అల్లు అర్జున్ దర్శకుడి పూజలు

మహానంది పుణ్యక్షేత్రంలో సినీ దర్శకుడు సురేంద్రా రెడ్డి శ్రీ కామేశ్వరి సమేత మహానంది ఈశ్వర స్వామి వారికి శనివారం రాత్రి ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనాన్ని అందించారు. ఆలయ అధికారులు శాలువాతో సత్కరించారు. అల్లు అర్జున్ నటించిన ‘రేసుగుర్రం’ చిత్రంతో తనకు దర్శకుడిగా మంచి గుర్తింపు లభించింది సరేంద్రా రెడ్డి తెలిపారు.
News November 9, 2025
ప్రచారానికి వాళ్లు దూరమేనా!

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు స్టార్ క్యాంపెయినర్ జాబితాలో ఉన్న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రచారానికి దూరమైనట్లేనని సమాచారం. నేటితో ప్రచార పర్వం ముగియనుండగా ఆయన వచ్చే సూచనలు కనిపించట్లేదు. ఆ బాధ్యతలను కేటీఆర్ భుజాలపై వేసుకొని కొనసాగిస్తున్నారు. అటు బీజేపీ నుంచి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, అన్నామలై, పురందీశ్వరి, రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ వస్తారని పేర్కొన్నా ఇప్పటి వరకు వారి జాడే లేదు.


