News April 1, 2025
కాగజ్‌నగర్: ఈనెల 3న నర్సరీ పండ్ల తోటల వేలం

కాగజ్‌నగర్ మండలంలోని జంబుగా ఉద్యాన నర్సరీ మామిడిపండ్ల తోటలను ఈనెల 3న వేలం వేస్తున్నట్లు ఐటీడీఏ పీవో కుష్బూగుప్త ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేలం పాటలో (2025- 26- 27) మూడు సంవత్సరాలకు కలిపి వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ తోటలో బంగన్పల్లి, దశేరి తోతపల్లి, రసాలు వంటి హైబ్రిడ్ రకాలు ఉన్నాయని తెలిపారు. ఆసక్తి గలవారు ఉదయం 11 గంటలకు వేలంపాటలో పాల్గొనాల్సిందిగా కోరారు.
Similar News
News November 4, 2025
త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టిన ఎస్బీఐ

బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ లాభాలను నమోదు చేసింది. ఈ FYలో సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్లో రూ.20,160 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాదితో పోలిస్తే(రూ.18,331 కోట్లు) 10% వృద్ధి సాధించింది. నికర వడ్డీ ఆదాయం 3% పెరిగి రూ.42,985 కోట్లకు చేరింది. వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం రూ.1,19,654 కోట్లకు పెరిగింది. ఫలితాల నేపథ్యంలో SBI షేర్లు స్వల్పంగా లాభపడి రూ.954.6 వద్ద ముగిశాయి.
News November 4, 2025
రైల్వే స్టేషన్లలో సమస్యలపై ప్రస్తావించాం: VZM ఎంపీ

విజయనగరం, బొబ్బిలి రైల్వే స్టేషన్లలో వేచి ఉండే హాల్, మరుగుదొడ్లు, ఎస్కలేటర్లు, తదితర సదుపాయాలు కల్పించాలని ఎంపీ అప్పలనాయుడు కోరారు. విశాఖలో మంగళవారం జరిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కి హాల్ట్, భువనేశ్వర్, తిరుపతి రైళ్లను ప్రతిరోజూ నడపడం, శబరిమల యాత్రికుల కోసం ప్రత్యేక రైళ్లు నడపాలని కోరినట్లు ఎంపీ తెలిపారు.
News November 4, 2025
కుష్టు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

జిల్లాను కుష్టు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద మంగళవారం ఆయన కుష్టు వ్యాధి నివారణ పక్షోత్సవాల గోడపత్రికను ఆవిష్కరించారు. ఈనెల 17వ తేదీ నుంచి కుష్టు వ్యాధి నివారణ పక్షోత్సవాలు మొదలవుతాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యరోగ్య శాఖ అధికారి దుర్గారావు దొర, తదితరులు పాల్గొన్నారు.


