News April 1, 2025

ఇది భారత్‌పై ప్రతీకారం తీర్చుకునే సమయం: US

image

భారత్, కెనడా, జపాన్ తదితర దేశాలపై ప్రతీకార సుంకాలకు సమయం ఆసన్నమైందని వైట్‌హౌస్ మీడియా సెక్రటరీ కరోలిన్ వెల్లడించారు. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ రేపు టారిఫ్‌లపై తుది నిర్ణయం తీసుకోనున్న వేళ ఈ వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. పలు దేశాలు ఎన్నో ఏళ్లుగా అధిక సుంకాలతో తమ దేశాన్ని దోచుకుంటున్నాయని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. IND 100% టారిఫ్స్ వసూలు చేస్తోందన్నారు. ఇప్పుడు తమ వంతని స్పష్టం చేశారు.

Similar News

News October 28, 2025

తీరాన్ని తాకిన తుఫాను.. 8-10 గం.లు జాగ్రత్త

image

AP: మొంథా తుఫాను కాసేపటి క్రితం <<18132869>>తీరాన్ని తాకింది<<>>. రాబోయే 8-10 గం. భారీ వర్షాలు, గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 10CM-20CM వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, గరిష్ఠంగా గంటకు 110 KM వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు. 6-7 అడుగుల ఎత్తు వరకు అలలు ఎగసి పడతాయన్నారు. రేపు మధ్యాహ్నం నుంచి సాధారణ స్థితి నెలకొంటుందన్నారు.

News October 28, 2025

కాల్స్ అన్నీ రికార్డ్ చేస్తారంటూ ప్రచారం.. నిజమిదే

image

వాట్సాప్ కాల్స్‌కు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయని జరుగుతున్న ప్రచారాన్ని హైదరాబాద్ పోలీసులు ఖండించారు. అన్ని ఫోన్ కాల్స్ రికార్డు చేసి సేవ్ చేస్తారని, సోషల్ మీడియా ఖాతాలను పర్యవేక్షిస్తారంటూ సర్క్యులేట్ అవుతున్న నకిలీ పోస్టర్‌ను నమ్మొద్దని సూచించారు. ‘ఈ పోస్టర్‌లోని సమాచారం పూర్తిగా అవాస్తవం. పోలీసులు దీనిని విడుదల చేయలేదు. దీనిని ఎవరూ షేర్ చేయొద్దు’ అని Xలో రాసుకొచ్చారు.

News October 28, 2025

కల్లుపై నిషేధం ఎత్తేస్తాం: తేజస్వీ యాదవ్

image

బిహార్‌ను దేశంలోనే నం.1గా తీర్చిదిద్దుతామని RJD నేత తేజస్వీ యాదవ్ అన్నారు. తమ మ్యానిఫెస్టో దీనికి రోడ్ మ్యాప్‌ అని చెప్పారు. ‘మేం గెలిస్తే కల్లుపై నిషేధం ఎత్తేస్తాం. అవినీతి అధికారులు, బీజేపీ నేతలు CM నితీశ్‌ను పప్పెట్‌గా చేశారు. NDA ఆయనను మళ్లీ సీఎం చేయదు’ అని పేర్కొన్నారు. కాగా తాము ఎక్కువ సీట్లు గెలుస్తామని అభిషేక్ బెనర్జీ (TMC) అన్నారు. OPS అమలు చేస్తామని దీపాంకర్ భట్టాచార్య(CPI) తెలిపారు.