News April 1, 2025
ఇవాళ విజిలెన్స్ విచారణకు HCA అధ్యక్షుడు!

SRHను వేధించిన ఘటనలో HCA అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు ఇవాళ విజిలెన్స్ విచారణకు హాజరుకానున్నారు. ఆయన విచారణకు రాకపోతే విజిలెన్స్ అధికారులే HCAకు వెళ్లే అవకాశం ఉంది. పాసుల కోసం జగన్‌మోహన్ రావు తమను వేధిస్తున్నాడంటూ ఇటీవల SRH సంచలన ఆరోపణలు చేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఘటనపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.
Similar News
News October 26, 2025
భారీ జీతంతో 16 ఉద్యోగాలు

అకాడమీ ఆఫ్ సైంటిఫిక్& ఇన్నోవేటివ్ రీసెర్చ్(AcSIR) 16 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు నవంబర్ 14 వరకు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ డైరెక్టర్, Sr మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: https://acsir.res.in/
News October 26, 2025
మోచేతులు నల్లగా ఉన్నాయా? ఈ టిప్స్ పాటించండి

అందంగా కనిపించాలని ముఖంపై పెట్టే శ్రద్ధ చాలామంది కాళ్లు, చేతులపై పెట్టరు. దీంతో మోచేతులు, మోకాళ్లు నల్లగా మారతాయి. దీన్ని కొన్ని ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. రోజూ కలబంద గుజ్జును మోచేతులు, కాళ్లకి రాస్తుంటే నలుపుదనం తగ్గుతుంది. స్పూన్ ఆలివ్ ఆయిల్‌లో కాస్త పంచదార వేసి దాంతో చేతులు, కాళ్లని స్క్రబ్ చేసి, 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి చర్మానికి రాసినా సమస్య తగ్గుతుంది.
News October 26, 2025
తుఫాను ఎఫెక్ట్.. TGలోనూ భారీ వర్షాలు

TGలోనూ ‘మొంథా’ ఎఫెక్ట్ ఉండొచ్చని HYD వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఈనెల 28న భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. కొమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈనెల 29న ADB, కొమురంభీం, మంచిర్యాల, NRML, PDPL, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని పేర్కొంది.


