News April 1, 2025
కృష్ణా: చిన్నారి మృతి.. హృదయవిదారకం

కృష్ణా (D) అవనిగడ్డ(M) పులిగడ్డలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెనాలి వాసులు నలుగురు చనిపోయిన సంగతి తెలిసిందే. మృతుల్లో 2 నెలల శిశువు కూడా ఉంది. ఆ చిన్నారికి నామకరణం చేసేందుకు మోపిదేవి ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుల్ని తరలిస్తుండగా కారు వెనుక సీటులో పసికందు పోలీసులకు కనిపించింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా పాపను బతికించడానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
Similar News
News April 3, 2025
నాగాయలంక: రూ.13.50లక్షల నిధులు దుర్వినియోగం

నాగాయలంక పీఏసీఎస్‌లో రూ.13.50 లక్షల నిధులు దుర్వినియోగమైనట్లు తన తనిఖీలో గుర్తించామని మచిలీపట్నం కేడీసీసీ బ్యాంక్ విచారణాధికారి మహమ్మద్ గౌస్ తెలిపారు. గురువారం నాగాయలంక కేడీసీసీ బ్యాంకులో ఆయన మీడియాతో మాట్లాడారు. గతేడాది సెప్టెంబర్‌లో తాను ఆడిట్ అధికారిగా వచ్చి నాగాయలంక పీఎసీఎస్‌లో పలు రికార్డులను తనిఖీ చేయగా, ఎరువుల స్టాక్‌లో వ్యత్యాసాలు, మొత్తాలలో తేడాలు ఉన్నట్లు గుర్తించామన్నారు.
News April 3, 2025
విజయవాడ: మహిళ హత్య.. నిందితుడి అరెస్ట్

పటమటలో మంగళవారం రాత్రి జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పటమట పోలీసుల వివరాల ప్రకారం.. లక్ష్మి అనే మహిళ తన భర్తతో కలిసి కాగితాలు ఏరుకొని జీవనం సాగించేది. వాంబే కాలనీకి చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి లక్ష్మిని శారీరకంగా కలవాలని బలవంతం చేశాడు. ఒప్పుకోకపోవడంతో మంగళవారం రాత్రి మద్యం తాగి విచక్షణారహితంగా అత్యాచారం చేసి హత్య చేసినట్లు తెలిపారు.
News April 3, 2025
VJA: మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

భార్య మాట వినటంలేదని మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్తపేట పోలీసుల కథనం మేరకు.. జక్కంపూడికి చెందిన అనిల్ కుమార్ తాపీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య ఓ బైండింగ్ షాప్‌లో పనిచేస్తూ ఉంటుంది. భార్యను పనికి వెళ్లవద్దంటూ అనిల్ కుమార్ హెచ్చరిస్తూ ఉన్నాడు. అయినా ఆమె పనికి వెళ్లడంతో బుధవారం ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.