News April 1, 2025
ఒత్తిడి వల్ల లంచ్ చేయలేదు: అశ్వనీ కుమార్

IPLలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే 4 వికెట్లతో సత్తా చాటిన MI బౌలర్ అశ్వనీ కుమార్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తొలి మ్యాచ్ కావడం వల్ల ఒత్తిడితో లంచ్ చేయలేదని, కేవలం అరటి పండు తిన్నట్లు చెప్పారు. మంచి ప్రదర్శన ఇవ్వడానికి తాను కొంత ప్లాన్ చేసుకోగా, జట్టు ఫుల్ సపోర్ట్ ఇచ్చిందన్నారు. షార్ట్ లెంగ్త్‌తో పాటు బ్యాటర్ల బాడీని టార్గెట్ చేస్తూ బంతులు వేయాలని కెప్టెన్ హార్దిక్ సూచించారని అశ్వనీ తెలిపారు.
Similar News
News April 6, 2025
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు GOOD NEWS

AP: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అలాగే ఉన్నత చదువులు కలిగిన ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పిస్తామని చెప్పారు. ఖాళీలు ఎక్కువగా ఉండటంతో మిగిలిన ఉద్యోగులపై భారం పడుతోందని, దీన్ని తగ్గించేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
News April 6, 2025
‘CID’ ACP ప్రద్యుమన్ పాత్ర ముగింపు.. షాక్‌లో ఫ్యాన్స్

ఫేమస్ హిందీ టీవీ షో ‘సీఐడీ’ తెలుగులోనూ చాలామందికి సుపరిచితమే. ఇందులో ప్రధాన పాత్రధారి ఏసీపీ ప్రద్యుమన్ మృతిచెందారని సోనీ టీవీ ట్వీట్ చేసింది. ఆ పోస్ట్ చూసిన చాలామంది పాత్ర పోషించిన శివాజీ సాటమ్ చనిపోయారనుకుని పొరబడ్డారు. షో హిట్ అవ్వడానికి ప్రధాన కారణమైన శివాజీని ఎందుకు తొలగించారంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఓ ప్రముఖ నటుడు కొత్త ఏసీపీగా నటించనున్నట్లు సమాచారం.
News April 6, 2025
కేజీ చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల చికెన్ ధరలు తగ్గాయి. హైదరాబాద్ నగరంలో గత వారం స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.280 ఉండగా నేడు రూ.230గా ఉంది. విజయవాడలో కేజీ రూ.310 నుంచి రూ.270కి తగ్గింది. బర్డ్ ఫ్లూతో ఏపీలో ఓ చిన్నారి మృతి చెందిందన్న వార్తల ప్రభావం ధరలపై చూపినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా చాలా మంది నాన్-వెజ్ తినేందుకు ఇష్టపడట్లేదు.