News April 1, 2025

నంద్యాల జిల్లాలో 67.02% పింఛన్ల పంపిణీ @9:45Am

image

నంద్యాల జిల్లాలో ఏప్రిల్ నెలకు సంబంధించి మంగళవారం ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రభుత్వం ఆదేశాలతో ఉదయం 7 గంటల నుంచే ఈ కార్యక్రమం ప్రారంభం కాగా.. ఉదయం 9:45 గంటలకు జిల్లాలో 67.02% పింఛన్ల పంపిణీ పూర్తయింది. ఇప్పటివరకు జిల్లాలో 2,14,590 మందికి గానూ 1,43,822 మందికి సచివాలయ ఉద్యోగులు పింఛన్ సొమ్మును అందజేశారు.

Similar News

News December 29, 2025

‘సంజీవని నిధి’కి విరాళాలు ఇవ్వండి.. విశాఖ కలెక్టర్ విజ్ఞప్తి

image

విశాఖ జిల్లాలోని పేదలకు, బాధితులకు అండగా నిలిచేందుకు ‘సంజీవని నిధి’కి స్వచ్ఛంద విరాళాలు అందించాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. నూతన సంవత్సర వేడుకల్లో పూలు, కేకులు, బహుమతులకు బదులుగా మానవత్వంతో ఈ నిధికి సాయం చేయాలని కోరారు. ఆసక్తి గల దాతలు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఖాతా (50100500766040, IFSC: HDFC0009179) ద్వారా విరాళాలు అందించి సామాజిక బాధ్యతను చాటుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

News December 29, 2025

సింహాచలంలో వైకుంఠ ద్వారం దర్శనానికి ఏర్పాట్లు పూర్తి

image

సింహాచలంలోని వైకుంఠ ద్వారం ద్వారా భక్తులకు దర్శనం కలిగించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసామని ఆలయ ఈవో సుజాత ఏఈఓ తిరుమలేశ్వర్ రావ్ తెలిపారు. దేవస్థానం సిబ్బంది పోలీస్ శాఖ సమన్వయంతో భక్తులకు దర్శన ఏర్పాట్లు పార్కింగ్ వసతి అన్నిచోట్ల అందుబాటులో ఉండేలా చేశామన్నారు. అన్న ప్రసాద వితరణ అదనంగా చేపడుతున్నామని తెలిపారు

News December 29, 2025

జనవరి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు

image

TG: జనవరి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని BAC మీటింగ్‌లో నిర్ణయించారు. 4న ఆదివారం సెలవు ఉండనుంది. దీంతో కొత్త సంవత్సరంలో 5 రోజులు సమావేశాలు జరగనున్నాయి. అయితే, 15 రోజులు అసెంబ్లీని నిర్వహించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ప్రజాసమస్యలు పక్కదారిపట్టేలా BRS, కాంగ్రెస్ వ్యవహరిస్తున్నాయని BJP రాష్ట్రాధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. INC హామీలపై చర్చ జరగాలన్నారు.