News April 1, 2025

NLG: మరోసారి దరఖాస్తుల గడువు పొడిగింపు

image

యువత స్వయం ఉపాధిలో రాణించేలా రాష్ట్ర ప్రభుత్వం యువ వికాసం పథకానికి శ్రీకారం కొట్టిన విషయం తెలిసిందే. తొలుత దరఖాస్తులకు ఏప్రిల్ 5 వరకు అవకాశం కల్పించింది. అయితే సర్వర్ సమస్యలు, దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి కుల, ఆదాయ తదితర ధ్రువీకరణ పత్రాలు అవసరం కావడంతో వాటి జారీకి సమయం పడుతోంది. దీంతో దరఖాస్తు గడువును ఈ నెల 14వ తేదీ వరకు పొడిగించింది. జిల్లాలో ఇప్పటివరకు 22,356 మంది దరఖాస్తు చేసుకున్నారు.

Similar News

News September 12, 2025

నల్గొండ: ఉద్యోగాలకు సాధనకు 15న ఆమరణ నిరాహార దీక్ష

image

రెండు లక్షల ఉద్యోగాల సాధనకు ఈనెల 15న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు నిరుద్యోగుల హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు పాలకూరి అశోక్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆమరణ నిరాహార దీక్షకు సంబంధించిన వాల్ పోస్టర్లను హైదరాబాద్‌లో గురువారం ఎంపీ ఆర్ కృష్ణయ్యతో కలిసి ఆవిష్కరించారు. అశోక్ కుమార్ మాట్లాడుతూ.. నిరాహార దీక్షకు పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ మద్దతు ప్రకటించాలని కోరారు.

News September 12, 2025

NLG: ఆర్టీసీలో యాత్రాదానం

image

యాత్రాదానం పేరుతో వినూత్న సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జానిరెడ్డి తెలిపారు. గిఫ్ట్ ఏ బస్ ట్రావెల్ పథకం కింద కార్పొరేట్ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు, NRIలు, సామాజిక బాధ్యతతో వృద్ధులు, దివ్యాంగులకు రవాణా సేవలు అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సంస్థకు విరాళాలు అందిస్తే యాత్రాదాన నిధి కింద ప్రత్యేక ఖాతాలో జమ చేస్తామని తెలిపారు.

News September 12, 2025

NLG: కుక్క పిల్లల దత్తతకు స్పందన భేష్!

image

నల్గొండ పట్టణంలో కుక్క పిల్లల దత్తత కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. దత్తత ఇచ్చేందుకు 30 కుక్క పిల్లలను గుర్తించారు. దత్తత తీసుకోవడానికి 25 మంది ముందుకు వచ్చారు. కుక్క పిల్లలు దత్తత తీసుకున్న వారు వాటి బాగోగులు చూసుకోవడంతో పాటు సంతానరహిత ఆపరేషన్లు చేయించనున్నారు. రానున్న రోజుల్లో ఎక్కువ మంది దత్తత కోసం వచ్చే అవకాశం ఉందని మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్ తెలిపారు.