News April 1, 2025
కృష్ణా: ఏప్రిల్ ఫూల్ చేశారా ఎవరినైనా.?

ఏప్రిల్ 1 వచ్చిందంటే పిచ్చి పనుల పండగే. ఒకరిని ఒకరు వంచించి, లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చెప్పుకుంటూ నవ్వుల జల్లు కురిపించేవారు. 2010-12 వరకు ఏప్రిల్ ఫూల్ హంగామా రచ్చరచ్చగా ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లోనే మెసేజ్‌లతో సరిపెట్టుకుంటున్నారు. మీకు ఎప్పుడైనా షాకింగ్ ఏప్రిల్ ఫూల్ అనుభవం వచ్చిందా.? కామెంట్ చేయండి..
Similar News
News July 7, 2025
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ పామర్రులో దొంగల ముఠాను అరెస్ట్
☞కృష్ణా: అస్వస్థతకు గురైన వల్లభనేని వంశీ
☞ మచిలీపట్నం: స్పందనలో అర్జీలు స్వీకరించిన అధికారులు
☞ ఆత్కూర్ స్వర్ణభారత్ ట్రస్ట్‌ను సందర్శించిన కలెక్టర్, ఎస్పీ
☞నూజివీడు: IIITలో 141 సీట్లు ఖాళీ
☞ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద ఆందోళన
News July 7, 2025
మెగా పేరెంట్స్-టీచర్ మీటింగ్ విజయవంతం చేయాలి: కలెక్టర్

మెగా పేరెంట్స్, టీచర్ మీటింగ్ ఈనెల 10న నిర్వహిస్తున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం సాయంత్రం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులతో జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలని కలెక్టర్ కోరారు. విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా సమావేశానికి హాజరయ్యేలా చూడాలని ఆయన సూచించారు.
News July 7, 2025
మచిలీపట్నం: స్పందనలో అర్జీలు స్వీకరించిన అధికారులు

మచిలీపట్నంలోని కలెక్టరేట్ మీటింగ్ హాలులో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు కలెక్టరేట్‌కు వచ్చారు. డీఆర్ఓ చంద్రశేఖర్, ఆర్డీవో స్వాతి, తదితరులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.