News April 1, 2025
యువతిని చంపి జీడితోటలో చెట్టుకు వేలాడదీశాడు

సాలూరు మండలం చీపురువలసలో జరిగిన యువతి హత్య కేసును పోలీసులు చేధించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మర్రివానివలసకు చెందిన ఐశ్వర్య విశాఖలో పనిచేస్తోంది. ఓ పెళ్లిలో దత్తివలసకు చెందిన వివాహితుడు రాంబాబుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. అతడ్ని గుడ్డిగా ప్రేమించిన యువతి పెళ్లి చేసుకోవాలని అడగ్గా ఇద్దరి మధ్య గొడవలు చెలరేగాయి. ఈ క్రమంలో రాంబాబు యువతిని చంపి చెట్టుకు చున్నీతో వేలాడదీసి ఆత్మహత్యలా చిత్రీకరించాడు.
Similar News
News April 3, 2025
ఈ తీర్పు రేవంత్ చర్యలకు చెంపపెట్టు: హరీశ్

TG: గచ్చిబౌలి కంచ <<15980925>>భూములపై <<>>సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును BRS నేత హరీశ్‌రావు స్వాగతించారు. ‘ఈ తీర్పు CM రేవంత్ దుందుడుకు చర్యలకు చెంపపెట్టులాంటిది. నిన్న పార్టీ ఫిరాయింపుల విషయంలో మొట్టికాయలు, నేడు కంచ భూముల విషయంలో సుప్రీం అక్షింతలు. అధికారం ఉంది కదా అని ఏది పడితే అది చేస్తానంటే చట్టం ఊరుకోదు. ఇది విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు, సామాజికవేత్తల విజయం. వారికి అభినందనలు’ అని Xలో రాసుకొచ్చారు.
News April 3, 2025
వారసత్వ సంపద గల నగరం మచిలీపట్నం: కలెక్టర్

మచిలీపట్నం నగరం వారసత్వ సంపద గల చారిత్రాత్మక నగరమని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. బందరు కోటను పర్యాటక సర్క్యూట్‌లో చేర్చేందుకు పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖల అధికారులతో కలిసి నగరంలోని బందరు కోట, డచ్ సమాధులను కలెక్టర్ పరిశీలించారు. తొలుత బందరుకోటను సందర్శించి చుట్టూ కలియ తిరిగారు.
News April 3, 2025
ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందాలి: మంత్రి జనర్సింహ

అందోల్: ప్రతి పేదవాడి వరకు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ ఫలాలు అందాలని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ గంజ్ ప్రాంతంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం అనంతరం మాట్లాడారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో సన్న బియ్యం చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. త్వరలోనే లబ్ధిదారులకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లను, ఇళ్ల స్థలాలు పంపిణీ చేపడతామన్నారు.