News March 26, 2024
స్పాట్ వాల్యూయేషన్.. ఫోన్లకు నో పర్మిషన్

TG: ఇంటర్ జవాబు పత్రాల స్పాట్ వాల్యూయేషన్‌ను బోర్డు మరింత కట్టుదిట్టంగా నిర్వహిస్తోంది. వాల్యూయేషన్ కేంద్రాల్లోకి ఫోన్లను అనుమతించకూడదని ఆదేశించింది. గతంలో సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో 16 కేంద్రాల్లో 20 వేల మంది అధ్యాపకులు వాల్యూయేషన్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. నాణ్యమైన మూల్యాంకనం కోసం ఒక్కొక్కరికి రోజుకు 30 పేపర్లు మాత్రమే ఇస్తున్నారు.
Similar News
News April 3, 2026
పాకిస్థాన్‌లో లీటర్ పెట్రోల్ రూ.458

పాకిస్థాన్‌లో ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో <<19319137>>రెండో సారి<<>> పెట్రోల్, డీజిల్ ధరలను అక్కడి ప్రభుత్వం పెంచింది. 42.7% పెరుగుదలతో లీటర్ పెట్రోల్ ధర 458 పాకిస్థానీ రూపాయలకు చేరింది. డీజిల్ రేటు 55% పెరిగి 520 PKRకి ఎగసింది. ఇవాళ్టి నుంచే ఈ రేట్లు అమల్లోకి వచ్చాయి. యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్ ధరలు అదుపు తప్పాయని, దీంతో ధరలు పెంచక తప్పలేదని పెట్రోలియం మంత్రి అలీ మాలిక్ అన్నారు.
News April 3, 2026
ఈ నొప్పులతో థైరాయిడ్‌ను ముందుగానే గుర్తించొచ్చు

శరీరంలో కొన్నిభాగాల్లో వచ్చే నొప్పులు థైరాయిడ్ అసమతుల్యతకు సూచన అని నిపుణులు అంటున్నారు. సాధారణంగా థైరాయిడ్ హార్మోన్లలో అసమతుల్యత ఉంటే ఎముకలను బలహీనపరుస్తుంది. ఇది వివిధ ప్రదేశాలలో నొప్పికి దారితీస్తుంది. మెడ, దవడ, చెవి నొప్పులు తరచూ వస్తుంటే థైరాయిడ్ పరీక్ష చేయించుకోవడం మంచిది. వీటితో పాటు కండరాల నొప్పి, కీళ్లు, మోకాళ్ల నొప్పి ఎక్కువగా వస్తున్నా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
News April 3, 2026
యుద్ధం.. అమెరికా ఆర్మీ చీఫ్‌పై వేటు

ఇరాన్‌తో యుద్ధం కొనసాగుతున్న వేళ అమెరికా ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ ర్యాండీ జార్జ్‌పై వేటుపడింది. వెంటనే పదవి నుంచి దిగిపోవాలని, రిటైర్మెంట్ తీసుకోవాలని డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ ఆదేశించారు. FBI డైరెక్టర్ కాష్ పటేల్, మరో ఇద్దరి తొలగింపుపైనా చర్చలు జరిగాయని వైట్‌హౌస్ వర్గాలు చెప్పాయి. రక్షణ శాఖ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి డజనుకు పైగా జనరల్స్, అడ్మిరల్స్‌ను హెగ్సెత్ తొలగించారు.


