News April 1, 2025
‘యువతిని చంపి 100 కి.మీలు బైక్‌పై తీసుకొచ్చారు’

సాలూరులో<<15956280>> యువతి హత్య<<>> కేసును పోలీసులు చేధించిన విషయం తెలిసిందే. యువతి మెడపై 2 గాయాలు ఉండడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. రాంబాబు ఐశ్యర్యను విశాఖ జిల్లా ఆరిలోవలోని ఓ రూములో చంపినట్లు తేలింది. అక్కడి నుంచి స్నేహితుల సాయంతో సాయంతో డెడ్‌బాడీని బైక్‌పై 100 KM తీసుకొచ్చి చెట్టుకు వేలాడదీశాడు. బైక్‌పై వచ్చినప్పుడు రికార్డ్ అయిన CC ఫుటీజీ ఆధారంగా రాంబాబును అరెస్ట్ చేశారు.
Similar News
News April 3, 2025
వారసత్వ సంపద గల నగరం మచిలీపట్నం: కలెక్టర్

మచిలీపట్నం నగరం వారసత్వ సంపద గల చారిత్రాత్మక నగరమని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. బందరు కోటను పర్యాటక సర్క్యూట్‌లో చేర్చేందుకు పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖల అధికారులతో కలిసి నగరంలోని బందరు కోట, డచ్ సమాధులను కలెక్టర్ పరిశీలించారు. తొలుత బందరుకోటను సందర్శించి చుట్టూ కలియ తిరిగారు.
News April 3, 2025
ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందాలి: మంత్రి జనర్సింహ

అందోల్: ప్రతి పేదవాడి వరకు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ ఫలాలు అందాలని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ గంజ్ ప్రాంతంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం అనంతరం మాట్లాడారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో సన్న బియ్యం చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. త్వరలోనే లబ్ధిదారులకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లను, ఇళ్ల స్థలాలు పంపిణీ చేపడతామన్నారు.
News April 3, 2025
నాగాయలంక: రూ.13.50లక్షల నిధులు దుర్వినియోగం

నాగాయలంక పీఏసీఎస్‌లో రూ.13.50 లక్షల నిధులు దుర్వినియోగమైనట్లు తన తనిఖీలో గుర్తించామని మచిలీపట్నం కేడీసీసీ బ్యాంక్ విచారణాధికారి మహమ్మద్ గౌస్ తెలిపారు. గురువారం నాగాయలంక కేడీసీసీ బ్యాంకులో ఆయన మీడియాతో మాట్లాడారు. గతేడాది సెప్టెంబర్‌లో తాను ఆడిట్ అధికారిగా వచ్చి నాగాయలంక పీఎసీఎస్‌లో పలు రికార్డులను తనిఖీ చేయగా, ఎరువుల స్టాక్‌లో వ్యత్యాసాలు, మొత్తాలలో తేడాలు ఉన్నట్లు గుర్తించామన్నారు.